AI వీడియో: సిల్క్ స్మిత కాదు వండ‌ర్ ఉమెన్

ఈ అద్భుత‌మైన వీడియోను షేర్ చేసిన వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు.

Update: 2025-01-23 12:58 GMT

సిల్క్ స్మిత .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రంగుల‌ సినీవినీలాకాశంలో ఓ వెలుగు వెలిగి అర్థాంత‌రంగా జీవితాన్ని ముగించిన సినీతార‌. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని భారతీయ సినిమాను దశాబ్దాల పాటు శాసించిన‌ బోల్డ్ అండ్ గ్లామరస్ బ్యూటీగా సుప‌రిచితం. సిల్క్ స్మిత ఇండ‌స్ట్రీ ఇచ్చిన పేరు అయితే.. విజయలక్ష్మి వడ్లపతి అనేది అస‌లు పేరు. విజ‌య‌వాడ నుంచి మ‌ద్రాసుకు క‌ళారంగంపై మ‌క్కువ‌తో ప‌య‌న‌మ‌య్యాక‌ అక్క‌డ ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొని న‌టిగా అనుకున్న స్థాయికి ఎదిగింది స్మిత‌.

స్మిత ఆత్మహత్య చేసుకుని 20 ఏళ్ళకు పైగా అయింది. కాని ఇప్పటి వరకు తాను ఎందుకు అలాంటి నిర్ణ‌యం తీసుకుంది? అన్న‌ది ఎవ‌రికీ తెలీని మిస్ట‌రీ. 23 సెప్టెంబర్ 1996 లో స్మిత చెన్నై లోని త‌న‌ అపార్ట్ మెంట్ లో చనిపోయినట్లు గుర్తించారు. అందుకు క‌చ్చితమైన కారణం ఎవరికీ తెలియకపోయినా ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేసారు.

ఇండ‌స్ట్రీలో ల‌వ్ ఫెయిల్యూర్.. భ్రమల్లో జీవించ‌డంతో చివ‌రికి తీవ్రమైన నిరాశకు గురైన సిల్క్ స్మిత ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని సమస్యలతో చివ‌రిరోజుల్లో పోరాటం సాగించార‌ని, చివ‌రికి త‌నువు చాలించార‌ని చెబుతారు. సిల్క్ స్మిత జీవితం స్ఫూర్తితో `ది డర్టీ పిక్చర్` (2011) బాలీవుడ్ లో తెర‌కెక్కి సౌత్ లోనూ విడుద‌లైంది. విద్యాబాల‌న్ న‌టించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించింది.

ఇప్పుడు సిల్క్ స్మిత లేక‌పోయినా, త‌న రూపాన్ని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో రీక్రియేట్ చేసారు సృజ‌నాత్మ‌క మేధావులు. సిల్క్ ని ర‌క‌ర‌కాల రూపాల్లో ఊహించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. బాక్స‌ర్, ఫైట‌ర్, ఆస్ట్రోనాట్, మోడ్రన్ గాళ్, వండ‌ర్ ఉమెన్, సూప‌ర్ ఉమెన్, కెప్టెన్ అమెరికా, మ‌త్స్య‌క‌న్య‌, దేవ‌క‌న్య‌, రారాణి ఇలా ఎన్నో కోణాల్లో సిల్క్ స్మిత‌ను ఏఐ లో ఆవిష్క‌రించిన తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి. దీనికి బ్యాక్ గ్రౌండ్ థీమ్ మ్యూజిక్ అంతే సముచితంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా జోడించ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది. ఈ అద్భుత‌మైన వీడియోను షేర్ చేసిన వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``నేను ఏమి చేయలేను? సిల్క్ స్మిత ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు`` అని అత‌డు రాసారు.

నిజానికి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్ స్మిత ప్ర‌తిభ అస‌మాన‌మైన‌ది. న‌టిగా, డ్యాన్స‌ర్ గా ఆల్ రౌండ‌ర్ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. ఈ తెలుగ‌మ్మాయి ఇచ్చిన‌న్ని ఎక్స్ ప్రెష‌న్స్ ఇంకెవ‌రూ ఇవ్వ‌లేదు అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే త‌న‌కు వ్యాంప్ పాత్ర‌ల్లో, ఐట‌మ్ నంబ‌ర్ల‌లో అవ‌కాశాలిచ్చి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న ఇమేజ్ ని నాశ‌నం చేసారు. అలా కాకుండా వండ‌ర్ ఉమెన్, క్యాట్ ఉమెన్, సూప‌ర్ ఉమెన్ గా అవ‌కాశాలిచ్చి ఉంటే, బ‌హుశా ఏంజెలీనా, హాలీ బెర్రీ, గాల్ గాడోట్ లా గౌర‌వంగా చూసి ఉండేవారేమో!

Tags:    

Similar News