రంగస్థలం... మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా. ఆ సినిమా పై అంచనాలు పెంచేలా ట్రైలర్లు... పాటలు సూపర్ హిట్ కొట్టాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌లా కనిపిస్తోంది. ఇప్పుడు మరో పాయింట్ కూడా తెలిసింది. అది కూడా సినిమా అంచనాలను పెంచడం ఖాయం. హీరో కమ్ విలన్‌గా సినిమా ఇండస్ట్రీలో సాగుతున్న ఆది పినిశెట్టి... సినిమాలో కీలక మైన పాత్ర పోషిస్తున్నాడు. అతడి పాత్ర ఏంటంటే...
రంగస్థలం మాస్ హీరో చిట్టి బాబు... అదేనండీ మన చెర్రీ. గుబురు గడ్డం... లుంగీ పంచెతో అదరగొట్టాడు. ఈ తమ్ముడికి అన్న అయిన కుమార్ బాబుగా ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు. రంగస్థలం టీమ్ ఆది పినిశెట్టి క్యారెక్టర్ పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను వదిలింది. అందులో కుమార్ బాబు అను వ్యక్తి గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టుగా ఉంది. ఓటు వేయమని కోరుతూ గోడకు అంటించిన పోస్టర్ ఇప్పుడు లీకైంది. ఆ పోస్టర్... ఆది లుక్... మనందరినీ 1980ల నాటి కాలానికి తీసుకెళ్లేలా ఉన్నాయి. నూనె రాసి నున్నగా దువ్విన జుత్తుతో... కళ్లద్దాలతో ఉన్న ఆది ఫోటోతో పాటూ... లాంతరు గుర్తుకే ఓటెయ్యమని కోరుతున్నట్టు రాసిన రాతలు... అప్పటి కాలానికి మనల్ని తీసుకెళ్లిపోతాయి.
పోస్టర్‌లో ఏమాత్రం ఆధునికత కనిపించకుండా... ఆనాటి కాలానికి అద్దం పట్టేలా డిజైనర్ చాలా బాగా పనిచేసింది. మొత్తమ్మీద ఆది ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఆది పాత్రే కీలకమని... అదే సినిమాను మలుపు తిప్పుతుందని టాక్. సినిమా విడుదలైతే కానీ... ఈ సస్పెన్స్‌కు తెరపడదు. రంగస్థలం మార్చి 30 భారీగా విడుదలవ్వబోతోంది. సుకుమార్... చెర్రీ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.