సీనియర్ దర్శకుడు రావిరాజ పినిశెట్టి తనయుడి గా ఇండస్ట్రీగా కి పరిచయం అయినా కూడా.. ప్రస్తుతం తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా తనదైన శైలిలో పాత్రలను చేస్తున్నాడు. హీరోగా ట్రై చేస్తూనే విలన్ గాను మెప్పిస్తున్నాడు. ఇక స్పెషల్ సపోర్టింగ్ రోల్స్ తో సినిమాకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు. సరైనోడు విలన్ గా మెప్పించి నిన్ను కోరి సినిమాతో గుడ్ అనిపించుకున్న ఆది ప్రస్తుతం మెగా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.
అయితే ఈ యువ హీరో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఆది మాట్లాడుతూ.. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం - పవన్ కళ్యాణ్ 25వ సినిమాలో నటిస్తున్నాను. ఆ పాత్రలు నా లైఫ్ లో ది బెస్ట్ అవుతాయనే నమ్మకం నాకు ఉంది. ఇక విలన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా చేస్తున్నందుకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను ఒక నటుడిని. అన్ని పాత్రలు చేసేవాడే అసలైన నటుడు. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. ప్రేక్షకులు కూడా అన్ని విధాలుగా నన్ను ఆదరిస్తున్నారు. ఒక నటుడికి ఇంతకన్నా హ్యాపీ ఏముంటుందని వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. చాలా సింపుల్ గా ఉండే హీరో. ఆయన హోదాని ఏ మాత్రం చూపించుకోరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ప్రస్తుతం ఆయన సినిమాలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా. త్రివిక్రమ్ గారు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫిల్ అయ్యాను. ఆ క్యారెక్టర్ చాలా వరకు నాకు ప్లస్ అవ్వడం ఖాయం. అలాగే చరణ్ - రంగస్థలంలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాను. సుకుమార్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. చరణ్ తో కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యిందనే చెప్పాలి. ఆయన నాకు ఫ్రెండ్ కూడా అయ్యారు. ఇండస్ట్రీలో నాని - మనోజ్ కూడా తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపారు.
ఎక్కువగా తనకు బయటకి రావడం ఇష్టం ఉండదని ప్రయివేట్ లైఫ్ కే చాలా ఇంపార్టెంట్ ఇస్తానని చెప్పుకొచ్చాడు ఈ హీరో కమ్ విలన్. ఇక తెలుగు తమిళ్ లో ఎలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధం. కానీ పాత్ర కు ప్రాధాన్యం ఉండి.. నాకు నచ్చితేనే చేస్తానని వివరించాడు. అలాగే పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నారు. అంతా సిట్ అయితే ఖచ్చితంగా చెబుతానని తెలిపాడు.