ఆది పినిశెట్టి .. నిక్కీ గల్రాని పెళ్లి టీజర్ పై ఓ లుక్కేయండి!

Update: 2022-08-13 09:10 GMT
ఆది పినిశెట్టి విలక్షణ నటుడు అనే చెప్పుకోవాలి. వీలైతే హీరో .. లేదంటే విలన్ .. పాత్ర ఏదైనా అది పవర్ఫుల్ గా ఉండాలి అనే రూట్లో ఆయన వెళుతున్నాడు. ఒకప్పుడు దర్శకుడిగా రవి రాజా పినిశెట్టి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు.

అలాంటి ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆది పినిశెట్టి, తండ్రి పేరును ఉపయోగించుకోకుండా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. తమిళంలోను .. తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ మధ్యనే ఆది పినిశెట్టి ఒక ఇంటివాడయ్యాడు. తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ గా మెరిసిన నిక్కీ గల్రాని మెడలో ఆయన మూడు ముళ్లూ వేసేశాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు చూసిన వాళ్లంతా జంట బాగుందనే అనుకున్నారు.

వాళ్లు అన్యోన్యంగా ఉండాలనే ఆశించారు. అలాంటి ఈ జంట తమ పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియోను త్వరలో వదలబోతున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ముందస్తుగా అందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. పెళ్లికి  సంబంధించిన వీడియోస్ కి కూడా టీజర్  లు వదలడంతో కొత్త సంప్రదాయానికి తెర తీశారు.

పెళ్లికి సంబంధించిన టీజర్ ను కూడా సినిమా రేంజ్ విజువల్స్ పైనే కట్ చేశారు. ఆది పినిశెట్టి - నిక్కీ మంగళ స్నానాలు .. పెళ్లి  కొడుకుగా .. పెళ్లికూతురుగా ముస్తాబుచేయడం, ఒకరిని ఒకరు తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా వెల్ కమ్ చెప్పడం .. పెళ్లి పీటలపై చిలిపి చూపులు .. కొంటె నవ్వులు .. ఇద్దరూ కలిసి స్టెప్పులు వేయడం .. సందీప్ కిషన్ .. మంచు మనోజ్ వంటి మిత్రులతో పాటు బందువులు కూడా వాళ్లతో కలిసి సందడి చేయడం టీజర్ లో చూపించారు. ఈ పెళ్లికి హాజరైన నటీనటులు .. రాజకీయనాయకులు .. వేడుకలోని ఇతర ఘట్టాలకు సంబంధించిన విజువల్స్ పూర్తి వీడియోలో కనిపించే అవకాశం ఉంది.

తమ పెళ్లి జరిగి మూడు నెలలు అవుతున్నా .. నిన్ననో .. మొన్ననో జరిగినట్టుగా అనిపిస్తుందంటూ ఆది పినిశెట్టి దంపతులు చెప్పారు. అంటే అంతటి  ప్రేమానురాగాల మధ్య కాలం కరుగుతుందని చెప్పకనే చెప్పారు. టీజర్ ఈ రేంజ్ లో కట్టిపడేస్తుందంటే .. ఇక పూర్తి వీడియో ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి. Full View


Tags:    

Similar News