అమీర్‌ఖాన్ అంటేనే పెర్ఫెక్షన్. పాత్రలోకి పరకాయం చేయడం కోసం అతడు పడే తపన, శ్రమ అంతా ఇంతా కాదు. పాత్ర స్వభావం ముందే తెలుసుకుని దానికోసం అకుంఠిత ధీక్షతో సాధన చేస్తాడు. అందుకే అతడిని మిస్టర్ పెర్ఫెక్ట్ అని పిలుస్తారు. అప్పట్లో గజినిగా మారిపోవడానికి అసాధారణమైన బాడీ లాంగ్వేజ్‌ని చూపించాడు.
ఇటీవలే ధూమ్ 3 కోసం కండ బలిసిన శరీరాన్ని తయారు చేశాడు. అంతరిక్షవాసి పీకే పాత్రలో ఒదిగిపోవడానికి అవసరమైన ఆహార్యాన్ని మార్చుకుని చూపించాడు. ఇలా ఏ క్యారెక్టర్ చేసినా .. అవసరాన్ని బట్టి మారిపోతుంటాడు. ఊసరవెల్లి రంగులు మార్చినంత సులువుగా క్యారెక్టర్ స్కిన్‌లోకి ఒదిగిపోతాడు. అందుకే దేశంలోనే అత్యంత క్రేజీయెస్ట్ స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు అమీర్.
ప్రస్తుతం 'దంగాల్' అనే చిత్రంలో రెజ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. రెజ్లర్ అంటేనే మహాకాయుడు అని అర్థం. దానికోసం ఇప్పటికే తిండి పెంచాడు. శారీరక వ్యాయామం చేస్తున్నాడు. నిత్యం జిమ్ కోసం వేకువఝామున 1 గంటకు నిద్ర లేస్తున్నాడు. 2 గం.లకు వ్యాయామం మొదలెట్టేస్తున్నాడు. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉన్న జిమ్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. తనతో పాటే కోచ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాడు.
షారూక్‌ఖాన్, హృతిక్‌రోషన్ తర్వాత ఆ రేంజులో మిడ్‌నైట్ ఎక్సర్‌సైజులు చేసే హీరోగా అమీర్ ఇప్పుడు చర్చల్లోకొచ్చాడు. ఏదైనా వృత్తికోసమే. అనుకున్నది సాధించడం కోసమే. దటీజ్ అమీర్.