బిగ్ బాస్ 8 : రోహిణి నాన్ స్టాప్ దూకుడు..!
బిగ్ బాస్ సీజన్ 8 లో ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ కు లక్ కలిసి వస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ కు లక్ కలిసి వస్తుంది. అఫ్కోర్స్ ఆమె కష్టానికి తగినట్టుగానే కాస్త లక్ కూడా యాడ్ అవుతూ వస్తుంది. దీనివల్ల ఈపాటికే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఆమె కాస్త ఇప్పుడు టాప్ 5 దాకా దూసుకెళ్లే అవకాశాన్ని కూడా చేజిక్కించుకోవాలని చూస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన రోహిణి దాదాపు 7, 8 వారాల నుంచి తక్కువ నామినేషన్స్ లో ఉంటూ వస్తుంది. ఆమె నామినేషన్స్ లో వస్తే లీస్ట్ ఓటింగ్ తో బయటకు వెళ్తుంది. కానీ ఆమె నామినేషన్స్ లోకి రావట్లేదు.
ఈ వారం ఆమె మెగా చీఫ్ అవ్వడం వల్ల నామినేషన్స్ లో లేదు. ఐతే బిగ్ బాస్ మరో 3 వారాల్లో ముగుస్తుంది కాబట్టి టికెట్ టు ఫినాలే రేసు మొదలైంది. ఈసారి ఈ టాస్క్ ను బిగ్ బాస్ టీం వెరైటీగా ప్లాన్ చేసింది. బిగ్ బాస్ ఇంతకుముందు సీజన్లలో వచ్చిన కొందరిని హౌస్ లోకి పంపించి వారితో ఈ టాస్క్ లను ఆడిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే టాస్క్ ను ఆడించేందుకు బిగ్ బాస్ సీజన్ 8 లోకి సీజన్ 4 కి చెందిన అఖిల్, అలేఖ్య వచ్చారు.
సీజన్ 4 తర్వాత వీళ్లు తమ తమ ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. ఐతే సీజన్ 8 టికెట్ టు ఫినాలే టాస్క్ కోసం ఈరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. వీరి రాకతో హౌస్ లో సందడి వాతావరణం ఏర్పడింది. ఐతే వీరు టికెట్ టు ఫినాలే కంటెండర్ టాస్క్ పెట్టగా అందులో రోహిణి మొదటి రౌండ్ గెలిచింది. ఆల్రెడీ మెగా చీఫ్ కోసం రోహిణి చూపించిన తెగువ అందరినీ మెప్పించగా టికెట్ టు ఫినాలేలో మొదటి రౌండ్ గెలుపుతో రోహిణి సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం టికెట్ టు ఫినాలే టాస్క్ లో రెండో రౌండ్ కూడా రోహిణినే గెలిచినట్టు టాక్. ఏది ఏమైనా మెగా చీఫ్ ని కష్టపడి ఆడి గెలుచుకున్న రోహిణి అప్పటి నుంచి తన ఆట పంథా మార్చి దూకుడు చూపిస్తుంది. తప్పకుండా రోహిణి టికెట్ టు ఫినాలే దక్కించుకుంటే మాత్రం టాప్ 5 లెక్కల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.