ఈసారి కేబీసీ 14 సీజ‌న్ లో మెగాస్టార్ తో గెస్ట్ అత‌డే!

Update: 2022-07-25 00:30 GMT
అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ క‌లిస్తే ఎంత రంజుగా ఉంటుందో కేబీసీ షోలో ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `కౌన్ బనేగా కరోడ్ పతి 14` గత కొన్ని రోజులుగా ప్రోమోలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎట్ట‌కేల‌కు మేకర్స్ చివరకు ప్రదర్శన తేదీని ప్రకటించారు. ఈ షో భారత స్వాతంత్య్ర‌ దినోత్సవానికి ఒక వారం ముందు ప్ర‌సారం మొద‌ల‌వుతుంది. ఛానెల్ షేర్ చేసిన ప్రోమో ప్రకారం.. కౌన్ బనేగా కరోడ్‌పతి 14 ఆగస్ట్ 7న ప్రీమియర్ అవుతుంది. భారతదేశ వృద్ధికి దోహదపడిన వివిధ‌ రంగాలలోని నిజ జీవిత హీరోలతో భారతదేశ స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకోవడానికి ఒక వారం పాటు షోని అంకితమిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

కౌన్ బనేగా కరోడ్‌పతి 14 నిర్మాతలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రీమియర్ తేదీని ప్రకటిస్తూ ప్రోమోను పంచుకున్నారు. ఈ క్విజ్ షో కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 2010లో త్రి-ఇడియట్స్ చిత్రంలో ప్ర‌ద‌ర్శ‌న‌తో పద్మభూషణ్ అవార్డు పొందిన నటుడు అమీర్ ఖాన్, ..అమితాబ్ బచ్చన్ తో పోటీదారుగా కనిపించనున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇప్పటికే తన సినిమా `లాల్ సింగ్ చద్దా`ను వివిధ షోలలో ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేస్తున్న ఈ షోలో ఇతర ప్రముఖుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. కార్గిల్ వార్ వెటరన్ మేజర్ D.P సింగ్- సేన మెడల్ గెలుచుకున్న కల్నల్ మితాలి మధుమిత (భారత సైన్యంలో మొదటి మహిళా అధికారి)- పద్మ విభూషణ్ క్రీడాకారిణి MC మేరీ కోమ్ - పద్మశ్రీ సునీల్ ఛెత్రి ( ఫుట్‌బాల్ ఆటగాడు) త‌దిత‌రులు ఉన్నారు.

ధోల్ బీట్ లు డ్యాన్స్‌లతో అతిథులను స్వాగతించడంతో గ్రాండ్ గా ఈ షో ప్రారంభం కానుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోమోలు  ఆక‌ట్టుకుంటున్నాయి.  ప్రోమోలలో ఒకదానికి నటుడు గగన్ అరోరా - అశ్వినీ అయ్యర్ తివారీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ ఆమెను రోజంతా `మాల్కిన్` అని పిలుస్తూనే ఉన్నారని గగన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అశ్విని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్ట్ ను షేర్ చేసింది. దానికి రెడ్ హార్ట్ ఎమోజీని జోడించింది.

KBC మేక‌ర్స్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలను పురస్కరించుకుని ఈ సీజన్ లో పోటీదారుల కోసం ప్రత్యేక జాక్ పాట్ బహుమతిని జోడించారు. 1 కోటి ప్రశ్నకు సమాధానమిచ్చిన తర్వాత పోటీదారుడు 7.5 కోట్ల ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమైతే వారు రిక్తహస్తాల(బ‌హుమ‌తి లేకుండా)తో ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. చివరి స్థాయికి చేరుకున్న తర్వాత రూ. 75 లక్షలు ఇంటికి తీసుకెళ్లండి అని ప్ర‌చారం చేస్తున్నారు.
Tags:    

Similar News