మిష్టర్ పర్ఫెక్ట్ మొదటి పోస్ట్ చూశారా?

Update: 2018-03-14 14:30 GMT
ఆమీర్ ఖాన్.. ఆయనను బాలీవుడ్లో అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. పేరుకి తగ్గట్టుగానే ఆమీర్ కూడా అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటాడు. కమర్షియల్ సినిమాలు అస్సలు నచ్చని ఆమిర్ ఎదో ఒక కొత్తదనం ఉండే స్క్రిప్ట్ మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు.

ఇప్పటిదాకా ఎలాంటి సోషల్ మీడియా లోనూ లేని ఆమిర్ ఇప్పుడు సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షమయ్యారు. వెరిఫికేషన్ కూడా అయిపోవడంతో ఆఫీషియల్ అకౌంట్ తో రాయల్ గా ఇంస్టాలోకో ఎంట్రీ ఇచ్చేశారు. ఎంట్రీ ఇచ్చిన కొద్దీ సేపట్లోనే వెలకొద్దీ ఫాలోవర్లను నమోదు చేసుకున్నారు. ఇది ఒక ఎత్తు అయితే ఆయన చేసిన మొట్ట మొదటి పోస్ట్ మరొక ఎత్తు. అది ఒకావిడ యవ్వనంలో ఉన్నప్పటి ఫోటో.

ఆమె ఎవరో కాదు జీనత్ హుస్సేన్. స్వయానా ఆమిర్ తల్లి. మొదటిఫోటోనే అమ్మది పెట్టి ఫ్యాన్స్ మనసు మళ్ళీ దోచేశాడు ఈ 'సీక్రెట్ సూపర్ స్టార్' హీరో. ఇండియాలోనే కాక దంగల్, 3 ఇడియట్స్, పీకే లాంటి చిత్రాలతో చైనా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించిన ఘనత కేవలం ఆమిర్ కే దక్కింది.



Tags:    

Similar News