ఒకరు ఇద్దరు కాదు.. తెలుగులో డబ్బింగ్ మార్కెట్ కలిగిన ప్రతి హీరోనూ ఇదే మాట చెబుతూ ఉంటాడు. 'త్వరలో ఒక తెలుగు సినిమా చేయబోతున్నా..' అని అంటూ ఉంటారు. అయితే ఏదైనా ఒక సినిమా డబ్బింగ్ సమయంలో మాత్రమే వారు ఈ మాట చెబుతారు. ఆ తర్వాత మళ్లీ కనిపించరు.
అనేక మంది తమిళ హీరోలు ఇదే పంథాను అనుసరిస్తున్నారు. సూర్య, విశాల్ వంటి వాళ్లు ఈ మాట తరచూ చెబుతూ ఉంటారు. ఈ మధ్య కమల్‌హాసన్ కూడా అదే మాట చెప్పాడు. 'ఉత్తమవిలన్' విడుదల సందర్భంగా కమల్ ఈ మాట చెప్పాడు. ఇప్పుడు 'చీకటిరాజ్యం' సినిమాతో ఆ మాట నిలబెట్టుకొంటున్నా అని కమల్ ప్రకటించుకొన్నాడు.
ఇది స్ట్రైట్ తెలుగు సినిమా అవుతుందని కమల్ అంటున్నాడు. మరి కమల్ మాట నిలబెట్టుకొంటున్నట్లే అనుకొంటే.. మిగతా హీరోలు ఎప్పుడు తమ మాట నిలబెట్టుకొంటారనేది ప్రశ్నార్థం అవుతుంది.
విశాల్, సూర్య వంటి వాళ్లు తరచూ స్ట్రైట్ తెలుగు సినిమా అంటూ ఉంటారు. మరి వారు ఎప్పటికి ఆ విషయంలో చొరవచూపుతారో అనేది ఒక సందేహం అయితే.. వాళ్లు ఎప్పటికీ అదే మాట చెబుతూ బండిలాగిస్తుంటారేమో అనేది మరో సందేహం!