గత ఏడాది మత అసహనం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తన ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసుకున్నాడు అమీర్ ఖాన్. అలాంటివాడు మొన్నామధ్య సల్మాన్ మీద విమర్శలు గుప్పించాడు. ‘సుల్తాన్’ షూటింగ్ సందర్భంగా తాను పడ్డ కష్టాన్ని వివరిస్తూ రేప్ కు గురైన మహిళ లాగా తన పరిస్థితి తయారైందంటూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అతడికి చురకలంటించాడు. నిజానికి అమీర్-సల్మాన్ మధ్య మంచి స్నేహం ఉంది. అది దృష్టిలో ఉంచుకోకుండా తొందరపడి అతణ్ని విమర్శించేశాడు అమీర్. సింపుల్ గా ‘నో కామెంట్’ అన్నా సరిపోయేది కానీ.. అమీర్ అలా ఊరుకోకుండా ఏవో వ్యాఖ్యలు చేసి సల్మాన్ తో కయ్యం పెట్టుకున్నాడు. అమీర్ వ్యాఖ్యలకు సల్మాన్ నొచ్చుకుున్నట్లుగా వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో సల్మాన్ ను కూల్ చేయడానికో ఏమో.. ‘సుల్తాన్’ సినిమా విడుదలవడం ఆలస్యం థియేటరుకెళ్లి చూసేశాడు అమీర్. అంతే కాదు.. ఈ సినిమా గురించి ట్విట్టర్లో చాలా పాజిటివ్ గా వ్యాఖ్యలు చేశాడు. అన్ని రికార్డులు బద్దలైపోతాయని.. సల్మాన్ అదరగొట్టేశాడని పొగడ్తలు గుప్పించాడు. ఇదంతా ఒక ఎత్తయితే ‘సుల్తాన్’ చూసి బయటికి వస్తూ రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ కనిపించడం మరో ఎత్తు. ‘సుల్తాన్’ మంచి సినిమానే.. భావోద్వేగాలకు గురి చేసే సినిమానే. కానీ థియేటర్ నుంచి బయటికి వస్తూ రుమాలుతో కళ్లు తుడుచుకునేంత ఎమోషన్ ఇందులో ఉందా అన్నదే డౌటు. అందులోనూ అమీర్ స్థాయి వ్యక్తి అంత భావోద్వేగానికి గురవుతాడా అన్నదీ సందేహమే. ఇదంతా సల్మాన్ కు బిస్కెట్ వేయడంలో భాగంగా అమీర్ ఆడిన డ్రామా లాగా ఉంది మరి.