స్టార్లంటే ఖాన్ లేనా?

Update: 2017-08-23 05:23 GMT
బాలీవుడ్ లో తిరుగులేని స్టార్లుగా వెలుగొందుతూ బాక్సాఫీస్ ను శాసిస్తున్నారు ఖాన్ ల త్రయం. ఒకటి రెండు కాదు... ఏకంగా ఇరవై సంవత్సరాలుగా హిందీ సినిమాల్లో షారుఖ్ - సల్మాన్ - అమీర్ ఖాన్ ల హవా నడుస్తోంది. స్టార్ అనే మాటకు మీనింగ్ లా వాళ్ల పేర్లు నిలిచిపోయాయి. అయితే స్టార్స్ అంటే ఖాన్ లు మాత్రమే కాదంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్. అలా అనడం కరెక్ట్ కాదని కూడా అంటున్నాడు.

‘‘ఇండస్ట్రీలో ఇంకా చాలామంది టాలెంటెడ్ అండ్ పాపులర్ స్టార్లు ఉన్నారు. స్టార్ డమ్ గురించి మాట్లాడేటప్పుడు ఖాన్ లతో పాటు వాళ్లనూ లెక్కలోకి తీసుకోవాలి. హీరో అక్షయ్ కుమార్ పాపులారిటీకి ఏం తక్కువ. అతడు నటించిన లేటెస్ట్ సినిమా టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. స్టార్ డమ్ మొత్తం ముగ్గురు ఖాన్ లకు పరిమితం చేయడం సరికాదు’’ అంటూ అమీర్ ఖాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. షారూఖ్ - సల్మాన్ తాజా సినిమాలు జబ్ హ్యారీ మెట్ సెజల్.. ట్యూబ్ లైట్ దారుణమైన ఫ్లాపయ్యాయి. ఈ సినిమాల విషయంలో వీళ్ల మ్యాజిక్కేం పనిచేయలేదు. మన ప్రయత్నాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి. కొన్నిసార్లు బోల్తా పడతాయి. స్టార్ స్థాయికి ఎదిగాక సినిమా ఫ్లాపవడం వల్ల అప్పటికప్పుడు వచ్చే నష్టం అంటూ ఏముండదు. మనవరకు మన పని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్లడమే ముఖ్యం అని అమీర్ ఖాన్ కంక్లూజన్ ఇచ్చాడు.

ప్రస్తుతం అమీర్ ఖాన్ తన నెక్ట్స్ సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో అమీర్ మ్యూజిక్ కంపోజర్ గా నటిస్తున్నాడు.  సింగర్ గా రాణించాలనుకునే ఓ అమ్మాయి జీవితగాథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చందన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా దీపావళి టైంకు థియేటర్లకు రానుంది.


Tags:    

Similar News