అన్నీ ఇచ్చిన దేశంపై అక్కసుతో మాట్లాడిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన కొద్దిరోజులు పాటు ఈ వాతావరణం నుంచి బయటపడాలని భావించినట్లుగా ఉంది. ఆ కారణంతోనే ఆయన విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దేశంలో ఉన్న అసహనం కారణంగా తన భార్య ఆందోళన చెందుతోందని... ఏదైనా ఇతర దేశానికి వెళ్లిపోదామా అని అడిగిందని ఇటీవల అమీర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్ని వర్గాల నుంచి అమీర్ పై దాడి మొదలైంది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు విదేశాల్లో గడిపి అంతా సద్దుమణిగాక మళ్లీ రావాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ముంబయి ఎయిర్ పోర్ట్ లో అమెరికాకు వెళ్ళే విమానాన్ని ఎక్కడానికి ముందు మీడియా కెమెరాలకు చిక్కిన అమీర్ ఖాన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా లోకానికి తెలిసింది. దీంతో ఆయన విదేశీయానంపైనా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
అమీర్ ఖాన్ ముంబయి విమానాశ్రయంలో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆయన తన డంగల్ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళినట్లు కొందరు చెబుతున్నారు. ఈమధ్యనే లూధియానాలో షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ మిగతా చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లారని అంటున్నారు. అయితే... అది కారణం కాదని... తన దురహంకార వ్యాఖ్యలపై అందరూ మండిపడుతుండడంతో ఆయన ఇదంతా తట్టుకోలేక కాస్త రిలీఫ్ గా ఉంటుందని.. ఈ వాతావరణానికి దూరంగా విదేశాల్లో గడిపేందుకు వెళ్లారని సమాచారం. ముంబయి విమానాశ్రయంలో కనిపించిన అమీర్ కు భారీ సెక్యూరిటీ ఉంది. ఆ హడావుడి, ఏర్పాట్లు అన్నీ చూస్తుంటే అది షూటింగు కోసం వెళ్తున్నట్లుగా లేదని చెబుతున్నారు.