ఒక్క ముద్దుతో అన్నిటికీ పర్ఫెక్ట్ ఆన్సర్

Update: 2018-03-14 12:43 GMT
మీడియాకి న్యూస్ కావాలి.. సెన్సేషన్ కావాలి. ఇందుకోసం ఎంతకైనా తెగించేస్తున్నారు. స్టార్లు.. సెలబ్రిటీల విషయంలో మరీ దారుణంగా మీడియా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా వీటికి బ్రేక్ పడడం లేదు. చివరకు వారి కుటుంబాల్లో విబేధాలు కూడా మీడియా సృష్టించేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి కూడా ఇలాంటి రూమర్లు చాలానే వినిపిస్తున్నాయి.

దంగల్ తో పేరు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్ ను.. ఇప్పుడు తనకు జోడీగా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీలో తీసుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. వీరిద్దరూ కలిసి అడపాదడపా రెస్టారెంట్లలో కనిపించడం కారణంగా.. ఆమిర్ కుటుంబంలో విబేధాలు అంటూ ప్రచారం జరుగుతోంది. తన భార్య కిరణ్ రావ్ కు ఆమిర్ ఖాన్ త్వరలో విడాకులు ఇచ్చేయనున్నాడని కూడా అంటున్నారు. అయితే.. వీటన్నిటికీ ఒకే ముద్దుతో ఆన్సర్ ఇచ్చాడు ఆమిర్. ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రం కోసం జోధ్ పూర్ లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్న ఈ స్టార్.. రీసెంట్ గా తన 53వ పుట్టిన రోజు సందర్భంగా.. ఫ్యామిలీతో గడిపేందుకు ముంబై వచ్చాడు.

ఎయిర్ పోర్టులోనే ఆమిర్ తో కేక్ కట్ చేయించింది కిరణ్ రావ్. ఆ కార్యక్రమం ముగియగానే తన భార్యను దగ్గరకు తీసుకుని లిప్ లాక్ చేసేశాడు ఆమిర్. ఈ ముద్దుతో తన భార్య అంటే తనకు ఎంతటి ప్రాణమో చెప్పేశాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తన ఫ్యామిలీపై వస్తున్న రూమర్స్ కు సింగిల్ కిస్ తో ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత.. ఇప్పుడు మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News