ఆమీర్ కి అవార్డు ఇవ్వకూడదట

Update: 2017-04-10 11:36 GMT
నామినీల నుంచి అవార్డ్ విజేతలను ఎంపిక చేయడం అంతో పెద్ద ప్రహసనం. ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులంటే వారి వారి ప్రాధాన్యతలు.. స్వయం లాభాలు బేస్ అయి ఉంటాయి. కానీ నేషనల్ అవార్డుల విషయంలో ఇలాంటివి ఉండవనే అనుకుంటాం. కానీ ఆ లెక్క కూడా తప్పని తేల్చేశాడు జాతీయ అవార్డు ఎంపిక కమిటీ జ్యూరీ ఛైర్మన్ ప్రియదర్శన్.

ఈసారి ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ కు జాతీయ అవార్డు కట్టబెట్టడం పెద్ద వివాదమే అయింది. దీన్ని చల్లార్చే ప్రయత్నాలు మానేసిన ప్రియదర్శన్.. మరింతగా రాజేస్తున్నాడు. తాజాగా ఆమీర్ ఖాన్ కు అవార్డు ఇవ్వకపోవడానికి.. ఈయన చెప్పిన కారణం వింటుంటే అనేక  సందేహాలు కలగడం సహజం. ఓ పదేళ్ల క్రితం అంటే.. 2007లో తారే జమీపర్ చిత్రానికి గాను అవార్డ్ ప్రకటిస్తే.. అందుకోవడానికి ఆమిర్ ఖాన్ రాలేదట. అలాంటప్పుడు ఎందుకు అతనికి ఇవార్డ్ ఇవ్వాలి.. ఇవ్వకపోయినా ఏం పర్లేదు అన్నది ఈయన వాదన.

నటనను గుర్తించి అవార్డ్ ఇవ్వడం జ్యూరీ సభ్యులు చేయాల్సిన పని. అందుకోవడం.. మానేయడం వారి విజ్ఞత. ఆమీర్ అప్పుడు తీసుకోకపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు. అలాగని యాక్టింగ్ ను గుర్తించడం మానేసి.. తనతో సినిమాలు చేసిన అక్షయ్ కుమార్. మోహన్ లాల్ లకు మాత్రం అవార్డులు ప్రకటించేసి.. ఆమీర్ కు ఇవ్వకపోవడానికి కుంటి సాకులు చెబుతుండడం మాత్రం దారుణమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News