దంగల్ తర్వాత మానలేకపోతున్నా

Update: 2018-03-19 05:10 GMT
బాలీవుడ్ స్టార్స్ అందరిలోకి విలక్షణమైన సినిమాలు చేయటంలో ముందుండే అమీర్ ఖాన్ ప్రయోగాలు చేయటంలో ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. సీక్రెట్ సూపర్ స్టార్ లో సపోర్టింగ్ రోల్ వేయడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే కథ నచ్చితే దేని గురించి ఆలోచించను అని ఋజువు చేసాడు. ప్రస్తుతం తగ్స్ అఫ్ హిందూస్తాన్ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న అమీర్ ఖాన్ తన వ్యసనాల గురించి తాజాగా నోరు విప్పాడు. సిగరెట్ తాగే అలవాటు ఎప్పటి నుంచో ఉందన్న అమీర్ దంగల్ కంటే ముందు ఒక ఏడాది పూర్తిగా మానేశాడట. కాని అది విడుదల అయ్యాక తిరిగి దాని బారిన పడటంతో ఎంత ప్రయత్నించినా ధూమపానం మానలేకపోతున్నా అంటూ విచారం వ్యక్తం చేసాడు. రాహుల్ ద్రావిడ్ యాడ్ ప్రతి సినిమా ప్రారంభంలో చూసిన ప్రతిసారి ఒకలా అనిపిస్తుందని,ఆ క్షణం మానేయలన్న కోరిక బలంగా కలిగినప్పటికీ మళ్ళి మొదటికే వస్తున్నాను అంటున్నాడు.

తోటి నటీనటులకు సిగరెట్ స్మోకింగ్ గురించి అనర్థాలు వివరించే అమీర్ ఖాన్ ఎంత ట్రై చేసినా ఇది మానలేకపోతున్నా అనటం వింతే. నిజానికి ధూమపానం అలవాటయ్యాక దాన్నుంచి బయటపడే మార్గం తెలియక మళ్ళి మళ్ళి దాని బారిన పడుతూ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతున్న వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అమీర్ ఖాన్ వాళ్ళకు అతీతుడేమి కాదు. ఈ విషయంలో తాను సామాన్యుడినేనని దీని ద్వారా స్పష్టం చేసాడు. కాని అతి త్వరలో మానటం మాత్రం ఖాయం అంటున్న అమీర్ ఖాన్ నిజంగా ఆ పని చేస్తే ఫాన్స్ తో పాటు ఎందరికో స్ఫూర్తినిచ్చినవాడవుతాడు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే మంచిదే.

తగ్స్ అఫ్ హిందూస్తాన్ ఆగష్టు విడుదలకు సిద్దపడుతోంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అదే నెలలో 2.0 వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపధ్యంలో టీం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమితాబ్ బచ్చన్ - కత్రినా కైఫ్ లాంటి క్రేజీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న తగ్స్ అఫ్ హిందూస్తాన్ బాహుబలి తర్వాత బాలీవుడ్ లో అంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. దంగల్ - సీక్రెట్ సూపర్ స్టార్ ద్వారా చైనాలో సైతం బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న అమీర్ ఖాన్ వీటి ద్వారా తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు.
Tags:    

Similar News