సామాన్యుడికి బ్యాంకులు పెట్టే సవాలక్ష కండిషన్లు.. రూల్స్ పెద్దోళ్లకు వర్తించవు. ఎవరు ఎంత ట్రాన్స్ ఫర్ అయినా సింగిల్ పేమెంట్ లో చేసేయొచ్చు. అందుకు నో రూల్స్. సింహం సింగిల్ గానే పేమెంట్ చేసేయగలదు! అన్న తీరుగా మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ అపార్ట్ మెంట్ కొనుగోలుకి సింగిల్ పేమెంట్ లో 35కోట్లు చెల్లించడం చర్చనీయాంశమైంది.
ఔరా! ఆయన లగ్జరీ ఆ రేంజులో ఉంటుందా మరి! అంటూ అంతా అమీర్ ఖాన్ లగ్జరీ లైఫ్ గురించి ఒకటే ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అసలింతకీ అమీర్ అంత పేమెంట్ దేనికి చెల్లించాడు అంటే... ఇటీవలే అతడు సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అదే ఆఫీస్ లో మరో 9000 చదపు అడుగుల అదనపు స్పేస్ ని కొనేశాడట. ఇది పశ్చిమ ముంబైలోని ఖరీదైన శాంటాక్రజ్ ఏరియాలో ఉండడంతో టూ కాస్ట్ లీ అని చెబుతున్నారు. దీనికోసం 35 కోట్లు సింగిల్ పేమెంట్ లో చెల్లించేశాడట. ఇందులో నాలుగు యూనిట్ల ఆఫీస్ స్పేస్ అమీర్ కి సొంతంగా ఉందట. ఆ మొత్తం యూనిట్లను కేవలం సినిమాలకే కాదు.. ఇతరత్రా వ్యాపారాలకు అమీర్ ఉపయోగించనున్నాడు.
సామాన్యుడిలా వాయిదాల్లో ఫ్లాటు కొనుక్కోవాల్సిన కర్మేంటి? ఆయన ఖాన్ దాదా! అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సింగిల్ పేమెంట్ కొనుగోలుపై పంచ్ లు పడుతున్నాయి. అయినా ఇలాంటి కొనుగోళ్లు రిచ్ గయ్ అమీర్ కి ఇప్పుడే కొత్తేమీ కాదు. ప్రెస్టేజ్ కోసం ఎంతకైనా తెగించేంత పెర్ఫెక్షనిస్టు అతడు. ఇకపోతే అమీర్ ఇటీవలే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ రూపంలో ఫ్లాప్ ని ఎదుర్కొన్నారు. తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు కసరత్తుల్లో ఉన్నాడు అమీర్.