న‌ట‌వార‌సురాళ్ల ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు!

Update: 2021-01-28 23:30 GMT
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే... జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే... ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు!!.. మ‌హానుభావుడు వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి ప‌ద‌జాలం ఇది. క్లాసిక్ 'గీతాంజ‌లి'(నాగార్జున‌-గీత‌-మ‌ణిర‌త్నం) సినిమా రిలీజై ద‌శాబ్ధాలు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది.

వేటూరి క‌విత‌లు అల్లేందుకు త‌న సినిమా హీరోయిన్ల‌నే ఇమాజినేట్ చేసుకునేవార‌ని.. లేదా న‌వ‌నాయిక‌లు క‌ళ్ల ముందు క‌నిపిస్తే క‌విత్వం పొంగి పొర్లి లిరిక్ గా మారేద‌ని నాటి రోజుల్లో గుస‌గుస‌లు వినిపించేవి. ఆ త‌న్మ‌య‌త్మంలో ఆయ‌న పాట రాసేవార‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు.

ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే చ‌క్క‌న‌మ్మ‌ల క‌వ్వింత తుళ్లింతకు కాళిదాసులైనా కవులుగా మారేట్టే క‌నిపిస్తోంది! పిక్చ‌ర్ లో కింగ్ ఖాన్ షారూక్ వార‌సురాలు సుహానా ఖాన్.. చుంకీ పాండే కుమార్తె అన‌న్య పాండే వారి గాళ్స్ గ్యాంగ్ ఉన్నారు. అన‌న్య మోస్ట్ క‌న్నింగ్ కొంటె భామ‌లా క‌నిపిస్తుంటే.. సుహానా కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇక ఇత‌ర భామ‌లు న‌వ్వేస్తూ తుళ్లింత‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అన‌న్య పాండే స్వ‌యంగా ఈ ఫోటోని షేర్ చేసింది.

''ఏదీ మార‌లేదు.. సుహానా బుర్ర తిన‌డం మిన‌హా.. కానీ కొన్ని కొన్ని సార్లు తింటానేమో!! అంటూ కొంటెగా టీజ్ చేస్తోంది అనన్య‌. మొత్తానికి అన‌న్య కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంటే త్వ‌ర‌లోనే సుహానా ఆరంగేట్రానికి రెడీ అవుతోంది. ఎంత ఎదిగేస్తున్నా ఏదీ మార‌లేదు. గాళ్స్ గ్యాంగ్ ర‌చ్చ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు సుమీ!
Tags:    

Similar News