సెలబ్రెటీలు కొన్ని సందర్బాల్లో వ్యక్తిగత జీవితాలను వదులుకోవాల్సి వస్తుంది. అంటే వారు చిన్న చిన్న సరదాలను కూడా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మా మాదిరిగా మా పిల్లలు అలా కాకూడదు అనే ఉద్దేశ్యంతో పిల్లలను మీడియాకు కాస్త దూరంగా ఉంచుతూ ఉంటారు. దాంతో వారు బయట ఉన్న సమయంలో జనాలు గుర్తించరు. తద్వారా వారు వారి వ్యక్తిగత జీవితాన్ని పూర్తి స్వేచ్చగా అనుభవించడంతో పాటు చిన్న చిన్న సరదాలను కూడా ఎంజాయ్ చేసే వీలు ఉంటుంది. కాని కొందరు సెలబ్రెటీలు మాత్రం మొదటి నుండే తమ పిల్లలకు బయట తమ కుటుంబ పరిస్థితుల గురించి వివరిస్తూ వాటికి అలవాటు పడేలా చేస్తూ ఉంటారు.
దేశంలోనే అతి పెద్ద సెలబ్రెటీ ఫ్యామిలీల్లో బచ్చన్ ఫ్యామిలీ ఒకటి అనడంలో సందేహం లేదు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కూడా బచ్చన్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అందుకే దేశ వ్యాప్తంగా తమకు ఉన్న స్టార్ డమ్ నేపథ్యంలో జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ మొదటి నుండే ఆ విషయాలను అర్థం చేసుకుంటూ బతికేస్తుందట.
ఆరాధ్య పెరుగుతున్న తీరును గురించి అమితాబచ్చన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐశ్వర్య మొదటి నుండి కూడా ఆరాధ్యకు ప్రజల్లో బచ్చన్ ప్యామిలీకి ఉన్న గౌరవం గురించి చెబుతూ వచ్చింది. ప్రతి ఒక్కరిని గౌరవించడం తో పాటు అందరి పట్ల ప్రేమగా ఉండాలని ఆమె చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆరాధ్య 9 ఏళ్ల వయసు. ఆమెకు ప్రతి విషయం అర్థం అవుతుంది. కనుక కుటుంబ పద్దతులను అర్థం చేసుకుంటూ నడుచుకుంటుందని మనుమరాలి గురించి బచ్చన్ చెప్పుకొచ్చాడు.