ఫోటో మూమెంట్: ఎంత 'ఆరాధ్య'భావమో...!

Update: 2015-05-18 04:57 GMT
'బచ్చన్' అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం. సినీ నటుడిగా వారి 'తారా' స్థాయిని గురించి చెప్పనవసరం లేదు. వారు ఆ స్థాయికి చేరుకున్నారంటే అందులో ఆయన నటనా పటిమతోపాటు సంస్కార విలువలూ వున్నాయి. వ్యక్తిగా ఓ మెట్టు పైకి ఎక్కించడంలో సంస్కారానికి మించిన నిచ్చెన ఏదీ లేదు. అది వారి కుటుంబం అంతటికీ అబ్బినట్టుంది. ఆ కుటుంబంలో అడుగెడిన వారసురాలు అభిషేక్, ఐశ్వర్యాల గారాల పట్టి ఆరాధ్యకు అదే వంటబట్టినట్టుంది. ఐశ్వర్య కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లేముందు తండ్రి కృష్ణరాజ్ రాయ్ ఆశీర్వాదం తీసుకుంది. దాన్ని గమనించిన ఆరాధ్య తన తల్లిని అనుసరిస్తూ తాతగారికి పాదాభివందనం చేసింది. చూసిన వాళ్ళంతా ఈ పాపాయికి పెద్దలంటే ఎంత ఆరాధ్యభావామో అని ఈ బుజ్జాయి ఆరాధ్యను తమ పొగడ్తలతో ముంచెత్తారు. వారసత్వం అస్తులకే పరిమతం కాలేదు. సంస్కారానికి.. అని నిరూపించింది ఆరాధ్య.         
Tags:    

Similar News