నాగ్ మేనల్లుడు స్పూఫుల్నే నమ్ముకున్నాడు

Update: 2016-08-07 05:40 GMT
ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు నాగార్జున మేనల్లుడు సుశాంత్. ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాలూ నిరాశ పరచడంతో నాలుగో సినిమా మొదలుపెట్టడానికే చాలా టైం తీసుకున్నాడు. రకరకాల కాంబినేషన్లు.. కథలు అనుకుని చివరికి.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్టు ప్రసాదిస్తాడని పేరున్న జి.నాగేశ్వరరెడ్డితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మొదలైన ఏడాదికి కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావట్లేదు. ఆ మధ్య ఎప్పుడో ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లకు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొన్నే ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేశారు. ట్రైలర్ కూడా వదిలారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే సుశాంత్ సక్సెస్ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన రెగ్యులర్ కామెడీనే ట్రై చేస్తున్నట్లుగా ఉంది. టైం మెషీన్ అంటూ బ్రహ్మిని అందులోకి తీసుకెళ్లి బకరాను చేయడం.. పృథ్వీకి డైరెక్టర్ పోస్టు ఇచ్చి త్రీడీ సీరియల్ తీయించడం.. ఇలా కోన వెంకట్-గోపీమోహన్ మార్కు కామెడీని ట్రై చేస్తున్నట్లుగా ఉన్నాడు నాగేశ్వరరెడ్డి. బాహుబలితో పాటు ఇంకొన్ని సినిమాల పేరడీలతో నవ్వించే ప్రయత్నం జరిగినట్లుంది. చాలా సినిమాల ఛాయలు కనిపిస్తున్నప్పటికీ కామెడీ అయితే బాగానే వర్కవుట్ అయినట్లుగా కనిపిస్తోంది. చూపించిందే చూపించినా.. నవ్విస్తే తెలుగు ప్రేక్షకులు మన్నించేస్తారు. ఈ ధైర్యంతోనే పైసా వసూల్ ఎంటర్టైనర్ తో రెడీ అవుతున్నట్లున్నాడు సుశాంత్. మరి రిజల్ట్ ఎలా ఉంటుందన్నది ఈ 19న తేలిపోతుంది.
Full View

Tags:    

Similar News