మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ 'ఎబీసిడీ' సినిమాతో మే 17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే సంగతి తెలిసిందే. సేమ్ టైటిల్ తో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అల్లు శిరీష్ సరసన రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భరత్.. నాగబాబు.. వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రలలలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో శిరీష్ డబ్బు విలువ సరిగా తెలియని ఎన్నారై. దీంతో శిరీష్ ఫాదర్ నాగబాబు శిరీష్ ను.. అతని ఫ్రెండ్ భరత్ ను ఏదో ఒక సాకు చెప్పి ఇండియాకు పంపిస్తాడు. అయితే అలవాటు ప్రకారం.. స్నేహితులు ఇద్దరూ కలిసి ఒక హై ఫై హోటెల్ లో దిగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. దీంతో "బిల్ మూడు లక్షలు అయింది.. డబ్బులు కట్టు" అంటూ హర్ష వార్నింగ్ ఇస్తాడు. చేతిలో ఉన్న కార్డ్స్ పని చేయవు. బ్యాంక్ కు వెళ్లి అడిగితే "బ్యాలెన్స్ ఈజ్ జీరో" అంటూ ఇన్ఫో ఇస్తారు. దీంతో శిరీష్ కు తన మాయదారి డాడీగారి ప్లాన్ అర్థం అయిపోతుంది. తన ఫ్రెండ్ తో "అర్థం కాలేదా.. ఈ ఇండియా ట్రిప్ మొత్తం ఒక స్కామ్" అంటాడు. అయితే నాగబాబు వీళ్ళకు బతకడానికి నెలకు ఐదు వేలు ఇస్తుంటాడు. ఐదు వేలకు హైదరాబాద్ లో ఏమొస్తుంది? అందుకే ఒక స్లమ్ లో మకాం పెడతారు. కష్టాలు పడతారు. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ రుక్సార్ ను కలుస్తాడు.
ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుంది. అమెరికాలో పెరిగిన వారిని సడెన్ గా ఇండియాలో వదిలేస్తే ఏమౌతుందనేది.. అందులోనూ తక్కువ డబ్బు తో బతకాలంటే అది ఎంత కష్టమో తెలిసిందే. ఫన్ వర్క్ అవుట్ అయినట్టే ఉంది. మరి నాన్నగారు పెట్టిన టెస్ట్ లో శిరీష్ పాస్ అయ్యాడా.. డబ్బు విలువ తెలుసుకున్నాడా? రుక్సార్ తో లవ్ స్టొరీ ఏమైంది.. అనేవి ఇక చూడాల్సిన విషయాలు. వెన్నెల కిషోర్ నిర్వహించే 'కాఫీ విత్ కిషోర్' ప్రోగ్రాం సీన్ బాగుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన "దిస్ ఈజ్ మ్యాన్షన్ హౌస్.. పూర్ పీపుల్స్ రిచ్ డ్రింక్.. రిచ్ పీపుల్స్ ఫేవరెట్ డ్రింక్" డైలాగ్ అదిరిపోయింది. మరి ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి..
Full View