ఆ సమయంలో హృదయం బద్దలయ్యేది

Update: 2019-01-24 14:30 GMT
వారసత్వం అనేది సినిమా ఇండస్ట్రీలో కేవలం ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకటి రెండు సినిమాలతో సక్సెస్‌ ను దక్కించుకుని, సొంతంగా ప్రూవ్‌ చేసుకోలేక పోతే ఎంత పెద్ద స్టార్‌ వారసుడైనా కూడా ప్రేక్షకుల నుండి తిరష్కరణకు గురి అవ్వాల్సిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కాస్త అటు ఇటుగానే రాణించాడు. హీరోగా పలు చిత్రాలు చేసినా కూడా ఒక్కటి అంటే ఒక్కటీ బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్‌ లు కాలేదు. దాంతో అభిషేక్‌ బచ్చన్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సెకండ్‌ హీరో పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.

తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో సోదరి శ్వేతతో కలిసి అభిషేక్‌ బచ్చన్‌ పాల్గొన్నాడు. ఆ షోలో పలు ఆసక్తికర విషయాలను అభిషేక్‌ బచ్చన్‌ షేర్‌ చేసుకున్నాడు. హౌస్‌ ఫుల్‌ 3 చిత్రం తర్వాత రెండేళ్ల పాటు నాకు ఆఫర్స్‌ రాలేదు. ఆ సమయంలో చాలా చిరాకుగా అనిపించేది. అప్పటి నుండి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు ఒప్పుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా అభిషేక్‌ బచ్చన్‌ పేర్కొన్నాడు.

హీరోగా నటించి సక్సెస్‌ లేకపోవడంతో ఇలా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించడం పట్ల ఎలా అనిపిస్తుందని కరణ్‌ ప్రశ్నించిన సమయంలో అభిషేక్‌ బచ్చన్‌ స్పందిస్తూ... క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న సమయంలో హృదయం బద్దలయినట్లుగా అనిపించేది, అప్పుడు మౌనంగా ఆవేదనను అనుభవించానంటూ చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఎలా రాణిస్తున్నామనేది చూస్తారు తప్ప, ఎక్కడ నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడు, ఎవరి వారసుడు అనే విషయాలను పట్టించుకోరంటూ అభిషేక్‌ బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనపై ఎప్పటికప్పుడు వచ్చే నెగటివ్‌ కామెంట్స్‌ గురించి అభిషేక్‌ బచ్చన్‌ స్పందిస్తూ ఆ కామెంట్స్‌ నన్ను పలు సార్లు బాధపెట్టాయి, కొన్ని సార్లు నవ్వించాయన్నాడు.
Tags:    

Similar News