అది చరణ్ కి చెప్పిన కథేనా..?
ఒక హీరోతో కాదన్న కథ.. లేదా హీరోకి కథ నచ్చినా ఆ టైం లో చేయడం కుదరక వదులుకున్న సినిమాలు వేరే హీరోల దగ్గరకు వెళ్లడం అనేది చాలా కామన్.
ఒక హీరోతో కాదన్న కథ.. లేదా హీరోకి కథ నచ్చినా ఆ టైం లో చేయడం కుదరక వదులుకున్న సినిమాలు వేరే హీరోల దగ్గరకు వెళ్లడం అనేది చాలా కామన్. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటివి జరగడం కామన్. తమ దాకా వచ్చిన ప్రతి కథ చేయడం ఏ హీరోకి సాధ్యం కాదు. అంతా సెట్ రైట్ అనుకున్నా ఎక్కడో ఒకచోట తేడా కొట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. హీరో కోసం వెయిట్ చేసే ఓపిక ఉన్న దర్శకులు అలా ఉండిపోతారు. మిగతా కొందరు మరో హీరోని వెతుక్కుంటారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సినిమా గురించి ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే ఈ సినిమా గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తుంది. అసలైతే ఈ సినిమా గౌతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడని.. చరణ్ కి కథ కూడా నచ్చినా శంకర్ డైరెక్షన్ లో సినిమా ఆఫర్ రావడంతో ఆ ప్రాజెక్ట్ కాదన్నాడని తెలుస్తుంది.
ఆమధ్య నిర్మాత దిల్ రాజు కూడా ఈ కామెంట్స్ కి బలం చేకూరేలా అన్ స్టాపబుల్ షోలో చరణ్ మరో సినిమా దాదాపు కన్ఫర్మ్ చేసే టైం లో దాన్ని వదిలి గేమ్ ఛేంజర్ చేశాడని అన్నారు. సో దిల్ రాజు అక్కడ చెప్పిన ప్రాజెక్ట్ గౌతం తిన్ననూరి ప్రాజెక్టే అని అనుకుంటున్నారు. చరణ్ కి నచ్చినా చేయడం కుదరలేదు. అది విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లడం రౌడీ స్టార్ దానికి ఓకే చెప్పడం సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. భగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా విషయంలో ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అంటూ ఒక టాక్ వినిపిస్తుంది. ఐతే వీడీ 12 సినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ టీజర్ ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తారని టాక్. రామ్ చరణ్ మెచ్చిన కథ అని తెలియానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై నమ్మకం మరింత పెరిగింది. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.