కూతురి కోసం చెవి కుట్టించుకున్న హీరో

Update: 2015-01-21 04:27 GMT
బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ బాలీవుడ్‌లో ఓ శకం. దశాబ్ధాలుగా చిత్రపరిశ్రమను ఏలుతూనే ఉన్నారు. అయితే ఆయన నటవారసుడిగా పరిశ్రమలో ప్రవేశించిన అభిషేక్‌ బచ్చన్‌ తండ్రి రికార్డుల్ని రిక్రియేట్‌ చేయలేకపోయాడు. కేవలం తండ్రి సృష్టించిన సామ్రాజ్యంలో తాను కూడా ఒక్కడిగా మాత్రమే మిగిలి ఉన్నాడు. ఖాన్‌ల త్రయానికి కానీ, నవతరం హీరోలతో కానీ పోటీపడేంతటి గొప్ప కథానాయకుడిగా తనని తాను ఆవిష్కరించుకోవడంలో విఫలమయ్యాడు.

అభి విఫలమైనా అతడి నటవారసురాలిగా ఆరాధ్య బాలీవుడ్‌ని ఏలడం ఖాయం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ తనయురాలిగా ఆరాధ్యపై ప్రపంచం దృష్టి సారిస్తుంది. స్టార్‌ కిడ్‌గా ఆరాధ్య అందలం ఎక్కుతుందని పండితపురోహితులు చెబుతున్నారు. ఏదేమైనా పుత్రోత్సాహము ఆ పుత్రుని కనంగ.. అన్న పద్యాన్ని నిజం చేస్తూ .. ఇప్పటికైతే ఆరాధ్యతోనే అభిషేక్‌ ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నాడు. కూతురికి ఇటీవలే దగ్గరుండి మరీ చెవి కుట్టించాడు. వజ్రం పొదిగిన ఓ రింగును చెవికి తగిలించాడు.

అంతేకాదు.. ఇలా కుట్టించుకున్నప్పుడు ఆరాధ్యకు ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో తెలుసుకోవడానికి తానుసైతం చెవి కుట్టించుకున్నాడు అభిషేక్‌. దానికి ఓ వజ్రపు పొదుగుతో చెవిదిద్దుని పెట్టుకున్నాడు. అదీ సంగతి.
Tags:    

Similar News