మీ ట్వీట్ లో తప్పుందేమో చూసుకోండి

Update: 2017-12-06 06:43 GMT
సెలబ్రిటీలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలకు బాగానే దగ్గరవుతున్నారు. తమ ఫ్యామిలీ ఫంక్షన్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే.. వీటిపై విమర్శలు.. ట్రాలింగ్ లాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి కానీ.. వాటిపై రియాక్ట్ అవడం చాలా తక్కువ.

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఈ ట్రాలింగ్ కు గురైన వ్యక్తే. భార్య ఐశ్వర్యా రాయ్ పై కామెంట్స్ వచ్చినపుడు కూడా స్పందించలేదు అభిషేక్. కానీ ఇప్పుడు కూతురుపై వచ్చిన కామెంట్ కు మాత్రం.. వెంటనే రియాక్ట్ అయిపోయాడు. రీసెంట్ గా ఐశ్వర్యారాయ్.. తన కూతురు ఆరాధ్యతో కలిసి ఓ ఈవెంట్ కు అటెండ్ అయింది. ఎప్పటిమాదరిగానే ఇద్దరూ ఒకే విధంగా కనిపించేలా డ్రెసింగ్ చేసుకుని చూడముచ్చటగా ఉన్నారు. కానీ ఓ మహిళ మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. 'మీ అమ్మాయికి స్కూల్ లేదా ఏంటి.. ఎప్పుడూ అమ్మతో కలిసి వేడుకలకు తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చదివే స్కూల్ వాళ్లు ఇన్నేసి సెలవలు ఎలా ఇస్తున్నారు' అని ట్వీట్ చేసింది ఓ లేడీ.

దీనికి అభిషేక్ కూడా స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చాడు. 'హలో మేడమ్.. వీకెండ్స్ లో దాదాపు అన్ని స్కూల్స్ కి హాలిడేస్ ఉంటాయి. మిగిలిన అన్ని రోజులు స్కూల్ కి వెళుతుంది. మా తప్పేం లేదు. మీ ట్వీట్ లో తప్పుందేమో చూసుకోండి' అంటూ రిప్లై ఇచ్చాడు అభిషేక్ బచ్చన్.
Tags:    

Similar News