ఇకపోతే అందరూ అనుకున్నట్లు ''కబాలి'' తెలుగు వర్షన్ కు రిలీజ్ అంతరాయం ఏదీ లేదు. అసలు ఈ ఆపేయడం అనే విషయాలు ఏమీ ప్రస్తావించలేదు కాని.. జూలై 22న సినిమా మాత్రం తెలుగులో గ్రాండ్ గా రిలీజవుతోందంటూ ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు పంపిణీదారులు.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ కబాలి సినిమాను తెలుగులో అల్లు అరవింద్ సీక్రెట్టుగా రిలీజ్ చేస్తున్నారనే టాక్ ఉన్నా కూడా.. నైజాంలో మాత్రం అభిషేక్ పిక్చర్స్ వారు రిలీజ్ చేస్తున్నారట. కరెక్టుగా 333 స్ర్కీన్లలో (టోటల్ 9 సెంటిమెంట్ కూడా ఉందటలే) ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సుదర్శన్ ధియేటర్లో సోమవారం మధ్యాహ్నం టిక్కెట్లు బుకింగ్ ఓపెన్ చేయగానే.. గంటలో 7 రోజుల టిక్కెట్లు అయిపోయాయ్ అంటున్నారు. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో ఏకంగా 700+ షుమారు ధియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారట.
పైగా కేవలం తెలుగు వర్షెన్ ఒక్కటే కాదు.. తమిళ్ మరియు హిందీ వర్షెన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ''కబాలి'' చెప్పిన టైముకే ప్రపంచంలో అంతటా రిలీజ్ అయిపోతుందనమాట. తెలుగు రాష్ట్రంలలో మాత్రం 1000 ధియేటర్లలో షుమారు రిలీజ్ అవుతోంది.