టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం 'యశోద'. ఈ సినిమా కు దర్శక ద్వయం హరి మరియు హరీష్ లు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా ను ఆగస్టు లో విడుదల చేయాలని భావించారు. కాని ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి కాని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
యశోద సినిమా షూటింగ్ టాకీ పార్ట్ పూర్తి అయ్యి కేవలం ఒక్క పాట పూర్తి అవ్వాల్సి ఉందని యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలపై.. వచ్చిన ఔట్ పుట్ పై దర్శక ద్వయం చాలా సంతృప్తికరంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ఒక జాతీయ స్థాయి మీడియా సంస్థ తో వీరు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను సమంత గురించి.. సినిమా గురించి చెప్పుకొచ్చారు.
దర్శకులు హరి శంకర్.. హరీష్ నారాయన్ లు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పలు అవార్డు విన్నింగ్ సినిమాలు చేశాం. కాని కమర్షియల్ గా జనాలకు చేరువ అయ్యే సినిమా ను చేసే ఉద్దేశ్యంతో యశోద స్క్రిప్ట్ ను చాలా కాలం క్రితం రాసుకోవడం జరిగింది. ఈ స్క్రిప్ట్ అనుకున్న సమయంలోనే ఖచ్చితంగా సమంత అయితేనే బాగుంటుందని అనుకున్నాం. ఆమెతో చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా సన్నివేశాలను రాసుకున్నాం.
ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ కు ముందు గానే ఈ సినిమా గురించి సామ్ తో చర్చించాం. కథను చెప్పిన వెంటనే ఒళ్ళు పులకరించింది.. తప్పకుండా ఈ సినిమాను చేస్తాను అంటూ కథ ను కేవలం 25 నిమిషాలు మాత్రమే విని ఓకే చెప్పేసింది. ఆమె ఈ కథను బలంగా నమ్మారు. అందుకే చాలా కష్టపడి ఈ సినిమా కోసం ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.
కొన్ని ప్రమాదకర సన్నివేశాలను డూప్ లతో చేయాలని భావించాం. కాని సమంత మాత్రం తానే స్వయంగా చేస్తానంటూ ముందుకు వచ్చారు. రోప్ సన్నివేశాలను కూడా డూప్ తో చేయాలని భావించాం.
కాని సమంత అందుకు ఒప్పుకోలేదు. నేనే చేస్తాను అంటూ ముందుకు వచ్చారు. యశోద సినిమా లో సామ్ పడ్డ కష్టం కనిపిస్తుంది. తప్పకుండా ఇది మమ్ములను జనాలకు దగ్గర చేస్తుందంటూ దర్శక ద్వయం నమ్మకం వ్యక్తం చేశారు.