ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ ఓ యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్నాడు. తమ కారును బాబీ ఢీకొట్టి వెళ్లిపోయాడని హైదరాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన హర్మీందర్ సింగ్ ఆరోపించారు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని ఆరోపిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో హర్మీందర్ సింగ్ ఓ పోస్ట్ పెట్టాడు. తన కారును గుద్దిన తర్వాత బాబీ...తమతో వాగ్వాదానికి దిగారని....అంతలోనే హఠాత్తుగా అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపాడు. బాబీ అతివేగంగా తమ కారును ఢీకొట్టిన చోట తన తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారని, కారు తీవ్రంగా డ్యామేజీ అయిందని చెప్పాడు. కనీసం బాబీ క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ విషయంపై తాను జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం హర్మీత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న రాత్రి 11.03 నిమిషాల ప్రాంతంలో తాను తన తల్లిదండ్రులతో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్నానని హర్మీత్ తెలిపాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 33లోని కేఫ్ అబ్బాట్ వద్ద తమ కారును బాబీ కారు వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టిందని హర్మీందర్ చెప్పాడు. ఆ కారును బాబీనే డ్రైవ్ చేస్తున్నారని చెప్పాడు. ఆ ఘటనలో తమ కారు పాక్షికంగా ధ్వంసమైందన్నారు. యాక్సిడెంట్ చేసిన సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని తెలిపాడు. కారు దిగిన బాబీ తనతో మాట్లాడుతూనే....సడెన్ గా అక్కడ నుంచి వెళ్లిపోయారని అన్నాడు. ఘటనాస్థలికి కొద్ది దూరంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో బాబీ పాల్గొని వస్తున్నారని స్థానికులు తెలిపారన్నాడు. యాక్సిడెంట్ చేసినా కూడా కనీసం క్షమాపణ చెప్పకుండా బాబీ అక్కడి నుంచి వెళ్లిపోవడం సరికాదన్నాడు. బాబీపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని పోస్ట్ చేశాడు. తన ఫేస్ బుక్ పోస్ట్ ను ఉన్నతాధికారుల దృష్టికి చేరేవరకు షేర్ చేయాలని, తప్పు చేసిన సెలబ్రిటీలపై కేసు నమోదు చేసేందుకు తనలాగే అందరూ ముందుకు రావాలని కోరాడు.