#ఆచార్య .. చరణ్ స‌ర‌స‌న మ‌రోసారి?

Update: 2020-12-06 07:32 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా చికిత్స తీసుకుని వేగంగా కోలుకున్న మెగాస్టార్ ఆ త‌ర్వాతా క్ష‌ణం స‌మ‌యం కూడా వృధా చేయ‌డం లేదు. గత సంవత్సర కాలంగా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షూటింగ్ ప‌రంగా డైల‌మా నెల‌కొన‌డంతో ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయింది. అందుకే చిరు ఎక్క‌డా రాజీకి రాకుండా ప‌ని చేస్తున్నారు.

చివరకి గందరగోళం నుంచి బ‌య‌ట‌ప‌డిన కొర‌టాల కూడా అంతే ప‌ట్టుద‌ల‌గా ప‌ని చేస్తున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు.

అయితే రామ్ చరణ్ స‌ర‌స‌న‌ ఎవరు రొమాన్స్ చేస్తారనే సస్పెన్స్ చాలా కాలం నుండి కొనసాగుతోంది. ఇటీవ‌ల యంగ్ ట్యాలెంట్ రష్మిక పేరు ప్ర‌ముఖంగా వినిపించింది.  కానీ ఇప్పుడు ఆలోచ‌న మారింద‌ని తెలిసింది. ఆచార్య హిందీ మార్కెట్ కు క‌లిసొచ్చేలా హిందీ హీరోయిన్ ను ఎంపిక చేయ‌డం స‌రైన నిర్ణ‌యం అవుతుంద‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌.

కొంతకాలం క్రితం కియారా అద్వానీ ఆ హీరోయిన్ పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చినా అప్ప‌టికి స‌స్పెన్స్ కొన‌సాగింది. కాబ‌ట్టి త‌న‌నే సంప్ర‌దించే వీలుంద‌న్న గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. కియరా న‌టించిన ల‌క్ష్మీ బాంబ్ ఇటీవ‌లే రిలీజై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి ప‌లు బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో కియ‌రా కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది. కియ‌రా డ్యాన్సులు అద‌ర‌గొట్టిన రెట్రో సాంగ్ దిల్ తేరా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కియ‌రా ఇంత‌కుముందు చ‌ర‌ణ్ స‌ర‌స‌న డిజాస్టర్ మూవీ `విన‌య విధేయ రామా`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి చెర్రీ స‌ర‌స‌న ఆఫ‌ర్ అందుకుందా లేదా..? ఈ ప‌రిస్థితుల్లో బాలీవుడ్ హీరోయిన్ల లో ఎవ‌రిని ఆ అదృష్ట అవకాశం వ‌రిస్తుందో వేచి  చూడాలి.
Tags:    

Similar News