ఆచార్య ఎఫెక్ట్‌... చిరంజీవి ఆర్డర్ మారుస్తున్నారా!

Update: 2022-05-05 02:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగా ఆశలు పెట్టుకుని ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా దారుణంగా నిరాశ పర్చింది. ఆచార్య బ్లాక్ బస్టర్‌ అవుతుందని నమ్మితే అది కాస్త డిజాస్టర్ గా నిలిచింది. ఈ స్థాయి డిజాస్టర్ గా టాక్ దక్కించుకుంటుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఆచార్య సినిమా విడుదల అయిన వెంటనే ఈ ఆగస్టు లోనే తన తదుపరి సినిమాను చిరంజీవి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఆచార్య సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా గాడ్‌ ఫాదర్‌ సినిమా ఆగస్టు లేదా అంతకు ముందే విడుదల అయ్యేది. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆచార్య ప్లాప్‌ వల్ల సినిమా విడుదల విషయంలో మెగా కాంపౌండ్‌ ఆలోచనలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది. గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ ల విషయంలో ముందు అనుకున్నట్లుగా కాకుండా కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

సినిమాల విడుదల విషయంలోనే కాకుండా ముందు ముందు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చిరంజీవి ఆలోచన మారిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గాడ్‌ ఫాదర్‌ మరియు భోళా శంకర్ సినిమాలు షూటింగ్‌ ముగింపు దశకు వచ్చాయి. మరో వైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా కూడా పట్టాలెక్కబోతుంది. ఇదే  సమయంలో తన కూతురు సుష్మిత బ్యానర్‌ లో ఒక సినిమాను.. రాధిక బ్యానర్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు.

ఇన్ని సినిమాలను కూడా వచ్చే ఏడాది వరకు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిరంజీవి మొన్నటి వరకు భావించారు. కాని ఇప్పుడు ఆచార్య సినిమా ఫలితం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా మెగా కాంపౌండ్‌ నుండి టాక్ వినిపిస్తుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు కాకుండా ఒకటి రెండు సినిమాలు చాలనే ఉద్దేశ్యానికి చిరంజీవి వచ్చారట.

ఆచార్య నిరాశ పర్చిన కారణంగా తదుపరి సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో తన తదుపరి సినిమాల విడుదల విషయంలో ఆర్డర్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ టాక్‌ వినిపిస్తుంది.

మొత్తానికి ఆచార్య చాలా పాఠాలను చిరంజీవికి చెప్పిందని.. దాంతోనే ఆయన సినిమాల హడావుడి కాస్త తగ్గించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. మెగా అభిమానులు మాత్రం చిరంజీవి తగ్గొద్దని కోరుకుంటున్నారు. ఒకటి ప్లాప్ అయినా ముందు ముందు వచ్చే సినిమాలు సక్సెస్ అవుతాయని వారు నమ్ముతున్నారు.
Tags:    

Similar News