కొన్ని సినిమాలు మార్పులకు శ్రీకారం చుడతాయి. చాలా మందిలో సరికొత్త జోష్ ని నింపుతాయి. అయితే కొన్ని మాత్రం ఎక్కడలేని జాగ్రత్తలని గుర్తు చేస్తాయి. మళ్లీ మళ్లీ రీ చెక్ చేసుకో అంటూ గుణ పాఠాల్ని నేర్పుతాయి. దాని వల్ల ఇతర డైరెక్టర్లకు ప్రెజర్ మొదలవుతుంది. ఇప్పడు ఇదే పరిస్థితిని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్' తో భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు.
ఈ మూవీతో బాలీవుడ్ లోనూ పాపులర్ అయినా చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ కు 'ఆచార్య' ఫలితం సడన్ బ్రేక్ లా మారింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగాస్టార్ తో కలిసి రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఓటీటీ దిగ్గజం ఆమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆదరణ దక్కడం లేదు.
దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రామ్ చరణ్ 'ఆచార్య' ఫలితం విషయంలో చాలా హర్ట్ అయ్యారట. అంతే కాకుండా తన తదుపరి ప్రాజెక్ట్ ల స్క్రిప్ట్ విషయంలో ఏ చిన్న ఛాన్స్ ని కూడా లైట్ తీసుకోవడం లేదట. చివరికి శంకర్ తో చేస్తున్న సినిమా విషయంలోనూ చరణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏ చిన్న అనుమానం అనిపించినా రీ చెక్ చేసుకుని క్లారిటీ తీసుకుంటున్నారట.
ఇక గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ విషయంలోనూ చరణ్ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారట. శంకర్ సినిమా తరువాత రామ్ చరణ్ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ మూవీని చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, ఎన్ వి. ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో రామ్ చరణ్ కాంప్రమైజ్ కానంటున్నాడట.
పక్కాగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మని, స్టోరీ నచ్చాకే ఫైనల్ కాల్ ఇస్తానని చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి స్పష్టం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫుల్ స్క్రిప్ట్ ని పక్కాగా పూర్తి చేసే పనిలో గౌతమ్ తిన్ననూరి వున్నారట. రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేసిన 'జెర్సీ' మూవీ ఫ్లాప్ అయింది. ఇదే టెన్షన్ తో చరణ్ .. గౌతమ్ తిన్ననూరికి స్క్రిప్ట్ లో కరెక్షన్స్ చెప్పారని, అంతా పక్కాగా కుదిరితే సినిమా పట్టాలెక్కుతుందని ఇన్ సైడ్ టాక్.