మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ''ఆచార్య''. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న విడుదలైంది. అయితే తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుని ప్లాప్ దిశగా పయనించింది.
మెగా అభిమానులను సైతం 'ఆచార్య' చిత్రం సంతృప్తి పరచలేకపోయింది. దీంతో తండ్రీకొడుకులు తొలిసారిగా కలిసి నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
'ఆచార్య' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత.. అంటే జూన్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ అమెజాన్ తో ఒప్పందం చేసుకున్నారే టాక్ ఉంది.
అయితే 'ఆచార్య' సినిమా థియేట్రికల్ రన్ వారానికే ముగిసే సూచనలు కనిపిస్తుండటంతో.. ముందుగానే డిజిటల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. మే 20 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగా ప్రసారం చేయడానికి అంగీకరించినందుకు 'ఆచార్య' మేకర్స్ కి అమెజాన్ ప్రైమ్ ఎక్కువ చెల్లించిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదట. సినిమాకు వచ్చిన నెగెటివ్ రెస్పాన్స్ కారణంగా మూడు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అపజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో విడుదలకు ముందుకు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ కథలో బలం లేకపోవడం.. కొరటాల మార్కు కనిపించకపోవడం లాంటి కొన్ని కారణాల ఆడియన్స్ తిరస్కరించారు.
థియేటర్లలో నిరాశ పరిచిన మెగా 'ఆచార్య'.. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. మరి ఓటీటీలోనైనా ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో చిరు కి హిరోయిన్ లేదు. చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించింది.
కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ చూసుకున్నారు.