మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూనే ఉంది. సైరా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అన్నారు. కాని సైరా సినిమా కోసం చిరంజీవి ఎక్కువ డేట్లు కేటాయించడంతో పాటు ఆచార్య కోసం ప్రత్యేక శ్రద్ద అవసరం అనే ఉద్దేశ్యంతో ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా ను మొదలు పెట్టాలనుకున్నారు. సైరా విడుదల తర్వాత అనుకోకుండా ఇంకాస్త ఎక్కువ గ్యాప్ వచ్చింది.
సరే సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలు అయ్యిందని అనుకుంటున్న సమయంలో కరోనా మొదటి వేవ్ వల్ల దాదాపుగా పది నెలల పాటు షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యి చివరి దశలో ఉండగా సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ కు ముందు సినిమాను మే లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. కాని విడుదల తేదీ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్టు నెలలో సినిమా విడుదలకు సాధ్యం కాకపోవచ్చు. ఇక సెప్టెంబర్ లో సినిమా విడుదలకు ప్రత్యేకమైన రోజులు ఏమీ లేవు. మరి అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేద్దామంటే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అన్నట్లుగా ప్రకటించారు.
దసరా నుండి సంక్రాంతి వరకు పెద్ద చిన్న సినిమాలు చాలా వరకు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కనుక ఈ ఏడాదిలో ఆచార్య సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యం మేకర్స్ కు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత కోసం కొరటాల శివ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఆచార్య విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యుల నుండి విడుదల కు సంబంధించిన అప్ డేట్ ఈ నెలలోనే చిరంజీవి బర్త్ డే సందర్బంగా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే చాలా ఆలస్యం అవుతుంది.. సంక్రాంతి కాకుండా ఇంకా ఆలస్యం అంటే మాత్రం మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాను ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. అపజయం ఎరుగని కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంతా నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తుది దశ పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నారట. కొరటాల శివ ఆచార్యను ముగించిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. సెప్టెంబర్ లో ఎన్టీఆర్ తో సినిమాను కొరటాల ప్రారంభించే అవకాశం ఉంది. ఇక చిరంజీవి వరుసగా లూసీఫర్ రీమేక్.. వేదాళం రీమేక్.. బాబీ దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. ఇంకా కొందరు దర్శకులు కూడా కథలు చెప్పి ఉన్నారు.