ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. కథ కుదరాలి. స్క్రిప్టులో ఇరువురి పాత్రలకు తగిన ప్రాధాన్యత కుదరాలి. పైగా తెరకెక్కించడంలో ఎంతో సాలిడ్ ట్యాలెంట్ అవసరం. అవన్నీ ఉన్నవాళ్లు కాబట్టే.. అంతటి పరిణతి ఉంది కాబట్టే రాజమౌళి- కొరటాల శివ- సుకుమార్ లాంటి దర్శకులు వరుసగా మల్టీస్టారర్లు చేయగలుగుతున్నారు. వాటితో అభిమానుల్ని మెప్పిస్తున్నారు.
ఇక కొరటాల అయితే చాలా పెద్ద సాహసమే చేశార. ఆయన మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను కలిపి ఆచార్య లాంటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పైగా దీనికి దేవాదాయ శాఖలో అవినీతిపై అస్త్రం గురిపెట్టడం నక్సలిజం బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేయడం సంస్కర్త కథను ఎన్నుకోవడం అనే చాలా సాహసాలు కొరటాల చేశారు.
ఆరంభం ఇందులో చిరంజీవి మాత్రమే హీరో. కానీ తర్వాత చరణ్ నటిస్తారని కథనాలొచ్చాయి. వేరొక ప్రముఖ హీరోని కూడా సంప్రదించారని టాక్ వినిపించింది. సదరు హీరో కాదన్న తర్వాతే చివరికి చరణ్ ని ఫిక్స్ చేశారని కూడా గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా తండ్రి కొడుకులు చిరంజీవి- చరణ్ కలిసి నటించడం అన్నది అసామాన్యం. మెగాభిమానుల అంచనాలకు ఇది అందనంత ఎత్తులో శిఖరాన్ని తాకేలా ఉండాలి. బహుశా అనుభవజ్ఞుడైన రచయిత కం దర్శకుడిగా కొరటాల దీనిని సాధిస్తారనే అంతా నమ్ముతున్నారు.
ఇక ఈ సినిమాలో నటించడం తన నిర్ణయం కాదని చరణ్ అంటున్నారు. స్క్రిప్టు కుదిరింది.. దర్శకుడు కోరారు అందుకే నటించానని తెలిపారు. అలాగే తండ్రితో కలిసి తాను నిర్ణయించుకున్నది కాదు. దర్శకుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే నటించాను.. అని తెలిపారు. ఆలయ నిధులు .. విరాళాల దుర్వినియోగం .. ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ అవినీతిపై పోరాటాన్ని ప్రారంభించిన మధ్య వయస్కుడి పోరాట కథ ఇది. అతడు నక్సలైట్ గా మారిన సామాజిక సంస్కర్తగా కూడా కనిపిస్తారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.