మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఆచార్య` చిత్రీకరణ ఆద్యంతం పూర్తయింది. కేవలం 10రోజుల చిత్రీకరణ మినహా మొత్తం పూర్తయిందని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ఈ సినిమాలో చరణ్ పాత్ర కేవలం అతిథి పాత్రేనా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఆచార్యలో సిద్ధ పాత్ర చాలా కీలకమైనది. సెకండాఫ్ అంతా కనిపించే పాత్ర ఇది అని కొరటాల క్లారిటీనిచ్చారు. అంటే 25 నిమిషాల నిడివి ఉన్న పాత్ర ఇది కానే కాదని క్లారిటీనిచ్చారు.
ఆచార్యలో ప్రధాన ఎపిసోడ్స్ అన్నీ చరణ్ సిద్ధ పాత్రతోనే ముడిపడి ఉన్నాయి. ఎమోషన్ చరణ్ చుట్టూనే తిరుగుతుంది. ఇది అతిథి పాత్ర కానే కాదు. ద్వితీయార్థం ఆద్యంతం ఈ పాత్ర ఉంటుంది. చిరు-చరణ్ తండ్రి కొడుకులు గా కనిపించరు.. అని కూడా కొరటాల తెలిపారు. అలాగే చరణ్ - పూజా హెగ్డే నడుమ రొమాంటిక్ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నామని కూడా తెలిపారు. ప్రస్తుతం తారక్ కోసం స్క్రిప్టు రెడీ అవుతోందని కూడా కొరటాల వెల్లడించారు.