మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆచార్య` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. కొరటాల మార్క్ సెన్సిబుల్ మార్క్ తో తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని అంతకంతకు పెంచేస్తున్నాయి. రిలీజ్ తేదీ ఎప్పుడెప్పుడా? అని మెగా అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. `ఖైదీ నెంబర్ 150`వ సినిమా తర్వాత మెగాస్టార్ `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని చేసారు. ఇది చిరంజీవి కెరీర్ లో ఓ ప్రయోగాత్మక చిత్రం. కమర్శియాల్టీకి దూరంగా ఉన్న చిత్రం కావడంతో మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న సమయంలో కొరటాల రంగంలోకి దిగారు.
అతని గత సక్సెస్ లు..మెగాస్టార్ మాస్ నేపథ్యంలోనే `ఆచార్య`పై అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. అయితే ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ దానికి సంబంధించి కొన్ని రోజులుగా సీక్రెట్ మిషన్ ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది.
హిందీ చిత్రాల పంపిణీదారులు.. నిర్మాతలతో చరణ్ తరుచూ సంప్రదింపులు జరుపుతున్నారుట. డీల్ కుదిరితే లాక్ చేసి రిలీజ్ కి సంబంధించి ప్లానింగ్ సిద్దం చేయాలని భావిస్తున్నారుట. అలాగే సినిమాని ముంబైలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్న ప్లాన్ మైండ్ లో ఉందని తెలిసింది.
చరణ్ ఇటీవలే రెండుసార్లు ముంబైలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. `ఆచార్య` రిలీజ్ కారణంగానే ఇలా ముంబై వెళ్లి ఉంటారని మీడియా కథనాలు మరోసారి హీటెక్కిస్తున్నాయి. బాలీవుడ్ రిలీజ్ ని ఇంత సీరియస్ గా తీసుకోవడానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. తెలుగు సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా 100 కోట్ల వసూళ్లను సునాయాసంగా సాధిస్తుందని `పుష్ప ది రేజ్ ` రుజువు చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు మెగా ఇమేజ్ తో చరణ్ తండ్రిని మరోసారి బాలీవుడ్ లోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
పైగా కొరటాల కథలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. అతని గత సక్సెస్ ల్ని హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలే ప్రయత్నాలు చేసారు. `ఆచార్య` కూడా సోషల్ ఎలిమెంట్స్ ఉన్న స్ర్కిప్ట్ కాబట్టి చరణ్ ధైర్యంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవికి బాలీవుడ్ ఎంట్రీ కొత్తేం కాదు. మెగాస్టార్ కెరీర్ పీక్స్ లో ఉండగానే 90వ దశంకంలోనే కొన్ని చిత్రాలు బాలీవుడ్ లో నటించారు. `ప్రతిబంధ్`.. `ది జెంటిల్‌మెన్`..` ఆజ్ కా గుండారాజ్` లో నటించారు. కానీ అవేవి మెగాస్టార్ కి అక్కడ అంతగా క్రేజ్ ని తీసుకురాలేదు.
దీంతో చిరంజీవి బాలీవుడ్ చిత్రాల ఆలోచన వెనక్కి తీసుకుని తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు తెలుగు సినిమా జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. డే బై డై టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్ తండ్రి మార్కెట్ ని కూడా విశ్వవ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. `ఆచార్య` చిత్రాన్ని ఎప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి