నీళ్లు పోసింది దిల్ రాజు .. నీడనిచ్చింది అనిల్ రావిపూడి!

Update: 2022-05-21 16:16 GMT
ఈ మధ్య కాలంలో సినిమాల్లో అలీ ఎక్కువగా కనిపించడం లేదు. సరైన పాత్రలు రాకపోవడంతో తానే  సినిమాల సంఖ్యను తగ్గించుకుంటున్నానని  ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. అలాంటి అలీ 'ఎఫ్ 3' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అకీ కూడా వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " మీ అందరికీ ఈ రోజున ఒక నిజం చెప్పాలి.  అనిల్ రావిపూడి ఎవరో మీలో ఎవరికైనా తెలుసా?

అనిల్ రావిపూడిని నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చూశాను. ఆ త్తరువాత రైటర్ గా చూశాను .. డైరెక్టర్ గా చూశాను. పవన్ కల్యాణ్ గారు యాక్ట్ చేసిన 'తమ్ముడు' సినిమా తెలుసుగా? ఆ సినిమా డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ కి తను బాబాయ్ కొడుకు.

సినిమా మీదున్న మోజుతో  .. సినిమా మీదున్న ప్రేమతో .. సినిమా మీదున్న అభిమానంతో .. సినిమా మీదున్న క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. చాలా కష్టాలు పడిన తరువాతనే ఆయన ఈ స్థాయికి వచ్చాడు.

అనిల్ రావిపూడి అనే ఆ మొక్కకి నీళ్లు పోసింది దిల్ రాజునే. ఆ మొక్క ఈ రోజున ఎదిగి .. అది వృక్షమై ..  ఇంతమంది  ఆర్టిస్టులకు .. టెక్నీషియన్లకు నీడనిస్తోంది. ఈ ఎండా కాలంలో నీడ కనబడితే బాగుండునే అనుకునేవారి కోసం చేసినదే 'ఎఫ్ 3' సినిమా. ఒక నిర్మాత బాగుంటే  సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ బాగుంటారు. అందువలన అందరూ కూడా ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి.

వెంకటేశ్ గారి విషయానికి వస్తే .. తను రామానాయుడిగారి కొడుకుననే గర్వాన్ని ఆయనలో ఎప్పుడూ చూడలేదు. నేను పెద్ద నిర్మాత కొడుకును .. పెద్ద హీరోను అని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన లొకేషన్ కి  లేటుగా వచ్చింది లేదు.

అందరికంటే ముందుగా ఆయనే వచ్చేస్తారు. అలాగే మా మెగా కుటుంబంలో పుట్టిన మా వరుణ్ కూడా. తన ఫ్యామిలీకి ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి, సమయానికి సెట్ కి చేరుకుని రెడీగా ఉంటాడు. ఇక కొంతమంది అక్కడి నుంచి వస్తారు .. రమ్మన్న సమయానికి రారు .. వెళ్లమంటే వెళ్లరు .. వాళ్లెవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది" అంటూ జనం ఊహకే వదిలేయడం కొసమెరుపు.
Tags:    

Similar News