నటుడు బ్రహ్మాజీ ఇంట పెళ్లి వేడుక

Update: 2019-11-29 12:06 GMT
టాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సంజయ్‌ నటించిన సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. ఈ సమయంలోనే సంజయ్‌ ఒక ఇంటి వాడయ్యాడు. బోపాల్‌ కు చెందిన ప్రమోద్‌ శర్మ మరియు పూనమ్‌ ల కుమార్తె అనుకృతి దీక్షిత్‌ ను సంజయ్‌ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే చాలా ప్రైవేట్‌ గా జరిగింది.

గోవాలోని ప్లానెట్‌ హాలీవుడ్‌ లో ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వరుణ్‌ తేజ్‌ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ లు మాత్రమే సంజయ్‌ స్నేహితులుగా హాజరు అయ్యారు. త్వరలో హైదరాబాద్‌ లో సినిమా ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో సంజయ్‌ వివాహ రిసెప్షన్‌ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. సంజయ్‌ వివాహ వేడుకలో బ్రహ్మాజీ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరిని అలరించాడు.
Tags:    

Similar News