ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ 'అఖండ' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. బోయపాటి టేకింగ్ .. బాలకృష్ణ యాక్షన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను నటుడు కోటేశ్వరరావు పోషించారు.
100కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'అఖండ' సినిమాకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 'అఖండ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాను. సెట్లో ఫస్టు టైమ్ అఘోర గెటప్ లో బాలకృష్ణను చూడగానే ఆశ్చర్యపోయాను. ఒక్కసారిగా రోమాలు నిక్కబొడిచాయి.
సాధారణంగా బాలకృష్ణ ఏ పాత్రను చేస్తున్నా, సెట్లో అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి స్నాక్స్ వస్తే మాకు ఆఫర్ చేసేవారు .. ఆయనకంటే మేము ఎక్కువగా తినేసేవాళ్లం. షాట్ గ్యాప్ లో ఎన్టీ రామారావుగారి గురించిన విషయాలను ఆయన ఎక్కువగా మాట్లాడుతుంటారు. అప్పటి సినిమా విశేషాలను గురించి చెబుతుంటారు. ఆయనకి బాగా నచ్చిన సినిమా 'కన్యాశుల్కం'. ఆ సినిమాలో డైలాగ్స్ చెబుతూ ఉంటారు.
'అఘోర' పాత్రను చేస్తున్నప్పుడు మాత్రం సెట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తో సహా ఆయన పిలిస్తే తప్ప ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లేవారు కాదు. ఎప్పుడు చూసినా ఆయన ఆ పాత్రలోనే ఉండేవారు.
ఈ సినిమాలో గొడ్డళ్లకి సంబంధించిన యాక్షన్ సీన్ ఒకటి ఉంది. గొడ్డలిని నోటితో పట్టుకునే ఒక సన్నివేశం చేస్తున్నప్పుడు బాలకృష్ణ కాలు స్లిప్ అయింది. అప్పుడు మేమంతా చాలా కంగారు పడిపోయాము.
వెంటనే ఆయన కాలు చాలా వాచిపోయింది. మరుసటి రోజు షూటింగు ఉంటుందా .. ఉండదా అనుకున్నాము. జానీ ఆ మరుసటి ఉదయం మేము షూటింగుకి వెళ్లేసరికి ఆయన సెట్లో ఉన్నారు. కాలు వచ్చిపోవడం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, 'ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేయడం ఎందుకూ?' అనేవారు. ఎప్పటిలానే యాక్షన్ చేస్తూ వెళ్లేవారు.
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఒక గుడి ఆవరణలో చేశాము. చెప్పులు వేసుకోవడానికి లేదు .. ఎండకి కాళ్లు బాగా కాలేవి. అయినా బాలకృష్ణగారు అలాగే చేశారు. కాస్త నల్లగా కనిపించడం కోసం ఆయన ఎండలో కాసేపు కూర్చునేవారు.