ప్రస్తుత రోజుల్లో హీరోలతో పాటు విలన్స్ ఎక్కువగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్స్ ఫిక్సిడ్ అమౌంట్ తీసుకుంటుంటే వాళ్ళు మాత్రం డైలీ పేమెంట్ కింద బాగానే సంపాదిస్తున్నారు. ఇక సినిమా రిజల్ట్ గురించి ఏ టెన్షన్ ఉండదు. ఎలా ఉన్నా వారి స్థాయిలో నటనను కబరిస్తే చాలు నెక్స్ట్ ఆఫర్స్ చాలా వస్తుంటాయి. ప్రస్తుతం హీరోల కంటే సహచర నటులే నటనలో చాలా గొప్పవారు అని కూడా చెప్పవచ్చు.
ఇక ఇప్పుడు ప్రభాస్ సాహో లో కూడా ఎన్నడు చూడని విధంగా అద్భుత మహా మహా నటులను ఒకే స్క్రిన్ పై చూపెట్టబోతున్నాడు దర్శకుడు సుజిత్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటీనటులతో దర్శకుడు నింపేశాడు. ఇప్పటికే నెయిల్ నితిన్ - ముకేశ్ లు విలన్స్ గా ప్రభాస్ తో పోరాటాలు చేస్తుండగా ఇప్పుడు వారితో మరోక మలయాళ అగ్ర నటుడు చేరబోతున్నాడు. నటుడిగానే కాకుండా రచయిత-దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న "లాల్" ఇప్పుడు ప్రభాస్ కి విలన్ గా మరనున్నాడు. సౌత్ లో అన్ని భాషల్లో లాల్ విలన్ గా చాలా పాత్రలు చేశారు. ఆయన తెలుగులో కరెక్ట్ గా పదకొండేళ్ల క్రితం ఒక సినిమా చేశారు. 2006 లో అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖాతర్నాక్ సినిమాలో లాల్ విలన్ గా చేశారు.
అయితే రీసెంట్ గా సాహో కోసం సుజిత్ వెళ్లి కథను వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుత తారగణాన్ని చూస్తుంటే దర్శకుడు దాదాపు ఒక నార్త్ స్టైల్ లో సినిమా తీస్తున్నాడు అనిపిస్తోంది. ఇంతవరకు తెలుగు నటీనటులను సుజిత్ ఎంచుకోలేదు. మరి పరభాషా నటినటులందరిని తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతారో చూడాలి.