నాని- సుధీర్ బాబు కథానాయకులుగా నివేద థామస్- అతిదీరావ్ హైదరీ కథానాయికలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన వి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. స్టైలిష్ కాప్ యాక్షన్ డ్రామాలో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఎంతో నేచురల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.
కానీ `వీ` సినిమా ఆశించినంత ప్రజాదరణ దక్కించుకోవడంలో విఫలమైంది. క్రిటిక్స్ మెప్పును పొందలేకపోయింది. అయితే ఈ మూవీ తమ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది అని సుధీర్- నాని తొలి నుంచి చెబుతూనే వచ్చారు. ఇందులో నటించిన సుధీర్ బాబుకి నానీకి కూడా పేరొచ్చింది.
ఇక `V` మూవీని ఇదిగో ఇలా బార్బర్ షాప్ లో వీక్షించారు నానీ. ఓవైపు కటింగ్ అవుతోంది. మరోవైపు సినిమా వీక్షణ పూర్తవుతోంది. ఆదివారం సాయంత్రం 6.30 పీఎం జెమినీలో `వీ` చూడండి అంటూ నాని ప్రచారం చేశారు.
అయితే ఓటీటీలో జనం ఇప్పటికే చూసేయడం వల్ల మాటి మాటికి ప్రకటనలతో విసిగించి టైమ్ వేస్ట్ చేసే టీవీల్లో చూసేందుకు జనం ఆసక్తిగా లేరు. ఓటీటీల్లో ప్రకటనల బెడద లేకుండా వీక్షించేందుకే ఆసక్తిగా ఉండడం బుల్లితెర టీఆర్పీలకు సమస్యాత్మకం అవుతోంది. చూడాలని ఉన్నా చూడలేక టీవీల్లో వదిలేసి ఓటీటీల్లో చూస్తున్నారు. అదీ సంగతి..!