'టాలీవుడ్'లో ఆ కమెడియన్ కాస్టింగ్ కౌచ్.. ఎవరబ్బా..?

Update: 2020-05-04 23:30 GMT
టాలీవుడ్‌ లో ప్రస్తుతం బిజీ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే.. ప్రగతి ముందుంటారు. హీరో హీరోయిన్లకు తల్లిగా.. అత్తగా.. వదిన అక్క ఇలా ఎలాంటి పాత్ర అయినా చేయగలరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. వందలాది సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి.. తాజాగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ కమెడియన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌ లో పేరు మోసిన కమెడియన్ ఒకరు తనతో మిస్ బిహేవ్ చేసాడని.. చెడుగా ప్రవర్తించాడని సంచలన విషయాలు బయటపెట్టింది. అలా ఆమె ఎదుర్కొన్న చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. కమెడియన్ పేరు అయితే చెప్పలేదు కాని చాలా ఎక్స్‌ ట్రాలు చేసాడని మాత్రం చెప్పుకొచ్చింది. ఇంకా అతని గురించి చెప్తూ.. ఆ సమయంలో ఆయన చాలా పెద్ద స్టార్ కమెడియన్. ఏడాదికి 20-30 సినిమాలు చేసే బిజీ ఆర్టిస్ట్.

తనతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో కావాలనే ఇబ్బంది పెట్టాడని.. పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో పాటు ముట్టుకోడానికి కూడా ట్రై చేసాడని చెప్పింది. అతడి మాటలు చేష్టలు తనకు చాలా ఇబ్బందిని కలిగించాయట. అందుకే విషయం చాలా దూరం వెళ్లకుండా వెంటనే తాను అతడితో మాట్లాడానని చెప్పి.. ఓ రోజు షూటింగ్ ముగిసిన తర్వాత కారావ్యాన్‌ లోకి తీసుకెళ్లి.. మీ మాటలు చేష్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రవర్తన అస్సలు బాగోలేదని - ప్రవర్తన మార్చుకోకుంటే బాగోదని" వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అక్కడితో అతను సైలెంట్ అయిపోయాడట. లేదంటే అనవసరంగా పెద్ద ఇష్యూ అయ్యేదని గుర్తు చేసుకుంది ఈ సీనియర్ నటి. ఆ తర్వాత కూడా షూటింగ్‌లో ఎప్పుడు కలిసినా చెడుగా ప్రవర్తించలేదని.. వార్నింగ్ బాగానే పని చేసిందని వెల్లడించింది ప్రగతి. ఇక ఆయనెవరో పేరు చెప్పకపోవడంతో అంతా ఆలోచనలో పడ్డారు.
Tags:    

Similar News