దేవరకొండ కింగ్‌డమ్ పై రష్మిక అలా.. సమంత ఇలా..!
విజయ్ దేవరకొండకి ఇన్నాళ్లకు కరెక్ట్ సినిమా పడిందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా కింగ్‌డమ్ అని ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ అనేస్తున్నారు. విజయ్ దేవరకొండకి ఇన్నాళ్లకు కరెక్ట్ సినిమా పడిందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ కింగ్ డం టీజర్ చూసి అతనితో నటించిన సమంత క్రేజీ కామెంట్ పెట్టింది. కింగ్ డం టీజర్ ని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్న సమంత గూస్ బంప్స్ అంటూ ఫైర్ సింబల్ పెట్టింది. ఇక మరోపక్క విజయ్ ఫ్రెండ్ రష్మిక మందన్న కూడా కింగ్‌డమ్ టీజర్ గురించి స్పెషల్ మెసేజ్ రాసింది. కింగ్‌డమ్ టీజర్ ని సోషల్ మీడియా స్టేటస్ గా పెట్టుకున్న రష్మిక ఈ మనిషి ఎప్పుడూ సంథింగ్ మెంటల్ తో వస్తాడు.. సో ప్రౌడ్ విజయ్ దేవరకొండ అంటూ రాసుకొచ్చింది.
కింగ్‌డమ్ టీజర్ చూస్తే అటు రష్మిక పెట్టిన కామెంట్స్ కి సమంత పెట్టిన మెసేజ్ కి పర్ఫెక్ట్ అనిపించేలా ఉంది. విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక డీలా పడ్డాడు. ఫ్యామిలీ స్టార్ అని లాస్ట్ ఇయర్ ఒక సినిమాతో వచ్చినా అది కాస్త నిరాశపరిచింది. జెర్సీ సినిమాతో తెలుగులోనే కాదు హిందీలో కూడా తన సత్తా చాటిన గౌతం ఈసారి విజయ్ తో సంథింగ్ స్పెషల్ సినిమాతో వస్తున్నాడు.
కింగ్ డం టీజర్ చూసే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇది కదా ఇన్నాళ్ల నుంచి మేము కోరుకునేది అనేలా కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ పాత్ర ఏంటి.. అసలు కథ ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా ఈసారి విజయ్ తన బెస్ట్ ఇచ్చి టాప్ లీగ్ లో నిలిచేందుకు వస్తున్నాడని అనిపిస్తుంది. తప్పకుండా విజయ్ దేవరకొండ కింగ్ డం వర్తబుల్ అనిపించేలా చేస్తుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పారు కాబట్టి ఈ సమ్మర్ కి రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ఫీస్ట్ అందించడం పక్కా అన్నట్టే కనిపిస్తుంది.
విజయ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా ఇదే అనుకుంటున్నారు. టీజర్ శాంపిలే అదరగొట్టగా సినిమా సెన్సేషన్ అనిపిస్తుందా లేదా అన్నది వచ్చాక తెలుస్తుంది.