రేసుగుర్రం - కిక్3 సినిమాల విలన్ - భోజ్ పురి హీరో రవికిషన్ మోసపోయారు. ముంబైకి చెందిన రియాల్టీ సంస్థ కమలా ల్యాండ్ గ్రూప్ తనను మోసగించిందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని జుహులో ఫ్లాట్ నిర్మిస్తామని చెప్పి తన వద్ద కోటిన్నర రూపాయలు వసూలు చేశారని.. కానీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవికిషన్ పేర్కొన్నారు..రియాల్టీ సంస్థ డైరెక్టర్లు జితేంద్ర జైన్ - జినేంద్ర జైన్ కేతన్ షాలపై ఈ మేరకు కేసు నమోదైంది.
కమలా ల్యాండ్ గ్రూపు సిద్ధాంత్ ప్రాజెక్టులో భాగంగా 3165 చదరపు మీటర్ల ఫ్లాన్ ఇస్తానని నటుడు రవికిషన్ వద్ద రెండు ఫ్లాట్ల కోసం ఆరున్నర కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రవికిషన్ కోటిన్నర రూపాయలు సంస్థకు చెల్లించారు. ఇందుకోసం ల్యాండ్ అలాట్ మెంట్ లెటర్ కూడా రవికిషన్ కు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదు. దీంతో మోసపోయానని తెలిసి రవికిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు సంస్థ బాధ్యులపై చీటింగ్ - బ్రీచింగ్ కేసు నమోదు చేశారు.