కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు సంజయ్ దత్. హీరోగా తన కెరీర్ అరంగేట్రం నుండి సంజయ్ దత్ ఎల్లప్పుడూ తనదైన విలక్షణ వ్యక్తిత్వం కరిజ్మాతో పాపులరయ్యారు. అతని మొదటి చిత్రం రాకీలో మృదువైన చాక్లెట్ బాయ్ పాత్రను పోషించడం నుండి KGF: అధ్యాయం 2లో అధీరగా భీకరమైన విలన్ గా నటించడం వరకు సినిమారంగంలో దత్ ప్రయాణం చాలా వైవిధ్యమైనది.
అతను ప్రస్తుతం తన ఇటీవల విడుదలైన పాన్-ఇండియా చిత్రం విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. అభిమానులు ఇకపైనా కేజీఎఫ్ 2 తరహాలో అతనిని ప్రతినాయకుడిగా చూడటానికి ఇష్టపడుతున్నారు.
ఇటీవలే సంజయ్ దత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ స్పెషల్ డేను గుర్తుచేసుకోవడానికి అతను తన సోషల్ మీడియాలోకి వెళ్లాడు.
KGF నుండి అధీర పాత్రలో ప్రవేశించేందుకు కారణం చెబుతూ.. దత్ జీ రాకీ పాత్ర ఫోటోని పంచుకున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 కి క్యాప్షన్ లో కృతజ్ఞతతో కూడిన నోట్ ను రాసారు. ``4 దశాబ్దాలు + 1 సంవత్సరం ఖచ్చితంగా ఒక జీవితకాలం ప్రయాణం! మీరంతా రాకీగా అప్పుడు... .. ఇప్పుడు అధీరగాను నాకు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఇంకా ఆశిస్తున్నాను.. నా అభిమానులు.. శ్రేయోభిలాషులంతా మరింత ముందుకు రండి.
#41YearsOfCinema అంటూ ఆనందం వ్యక్తం చేసారు. ఈ నాలుగు దశాబ్ధాల జర్నీలో ఇంత ఆనందంగా దత్ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల విడుదలైన KGF: చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. కఠినమైన విలన్ గా అధీర పాత్ర తో దత్ మైమరిపించారు. సౌత్ సినిమాతోనే దత్ కి పాన్ ఇండియా క్రేజ్! అంటూ కొందరు అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. సౌత్ వల్లనే సంజూ భాయ్ కి ఆ గుర్తింపు! హిందీ చిత్రసీమలో విజయాలు ఉన్నా కేజీఎఫ్ 2తో దక్కినది అసాధారణం అని కీర్తిస్తున్నారు. సంజూ భాయ్ కి థర్డ్ ఇన్నింగ్స్ లాంటిది అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సంజయ్ దత్ కి షంషేరా- గూఢచారి- పృథ్వీరాజ్ వంటి కొన్ని భారీ ప్రాజెక్ట్ లు రిలీజ్ కానున్నాయి. ఇవే గాక.. అతడు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లకు సైన్ అప్ చేసాడు. త్వరలో అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.