జక్కన్న X నీల్.. అలా కంపేర్ చేస్తే..
ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు జక్కన్న, నీల్.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, శాండిల్ వుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ తమ తమ చిత్రాలతో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఓ రేంజ్ లో మెప్పించారు. అందరి దృష్టి తమ అప్ కమింగ్ చిత్రాల వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు జక్కన్న, నీల్.
రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 మూవీ చేస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రాజమౌళి.. తన కొడుకు కార్తికేయతో కలిసి షూటింగ్ లొకేషన్లు ఫిక్స్ చేసి వచ్చినట్లు సమాచారం. టైటిల్ ను గరుడగా కన్ఫర్మ్ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మాత్రం.. అంతా SSMB 29 ప్రాజెక్టుగానే పిలుచుకుంటున్నారు. అప్డేట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఫెస్టివల్స్, అకేషన్స్ వచ్చి వెళ్లిపోతున్నా ఇంకా అప్డేట్ కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. కానీ జక్కన్నపై నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు. మరోవైపు, ప్రశాంత్ నీల్.. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన మూవీ పనులతో బిజీగా ఉన్నారు.
మరికొద్ది రోజుల్లో ఆ సినిమా షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్.. తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ -2ను కంప్లీట్ చేస్తున్నారు. అది అయ్యాక నీల్ తో చేయాల్సిన మూవీ కోసం రంగంలోకి దిగనున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ తప్ప మేకర్స్ మరో అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఆ ప్రాజెక్టును NTR - NEEL ప్రాజెక్ట్ గా అందరూ పిలుచుకుంటున్న విషయం తెలిసిందే.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ చిత్రానికి వర్కింగ్ టైటిల్ విషయంలో రాజమౌళి కంటే కొంచెం తెలివిగా బిహేవ్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. తారక్ మూవీకి NTR 31 అని కాకుండా మొదటి నుంచి ఎన్టీఆర్-నీల్ చిత్రంగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు మూవీకి రాజమౌళి SSMB-SSRగా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు.
ఒకవేళ ఇప్పుడు అలా ప్రమోట్ చేద్దామనుకున్నా.. అంతగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. ఆ విషయంలో కాస్త రాజమౌళి ఆలోచించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. వర్కింగ్ టైటిల్ లోనూ జక్కన్న బ్రాండ్ ఉంటే బాగుణ్ణు అని అంటున్నారు. మరోవైపు, వర్కింగ్ టైటిల్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని కొందరు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి కంపారిజన్స్ అవసరం లేదని అంటున్నారు.