కొన్ని కాంబినేషన్ ల్లో సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా ప్రకటన వస్తే అభిమానుల ఆనందంకు అవధులు ఉండవు. ఖలేజా తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మహేష్ త్రివిక్రమ్ ల మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన సమయంలో అభిమానుల ఆనందంకు అవధులు లేవు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఇదే తరహా ఆనందంను తమిళ సినీ ప్రేమికులు పొందుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య మరియు ప్రముఖ దర్శకుడు బాలా కాంబినేషన్ లో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
2001 సంవత్సరంలో వీరిద్దరి కాంబోలో నంద సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను దక్కించుకుని సూర్యకు నటుడిగా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ సమయంలోనే సూర్యకు తమిళంలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత రెండేళ్లకు పితామగన్ ను బాలా దర్శకత్వంలో సూర్య చేయడం జరిగింది. ఆ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు సూర్య మరింత చేరువ అయ్యాడు. అలా తన కెరీర్ లో చాలా కీలకమైన రెండు సినిమా లను బాలా దర్శకత్వం లో చేసిన సూర్య దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన దర్శకత్వంలో చేయలేదు. వీరిద్దరి కాంబో సినిమా కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకులు మరియు అభిమానులు కోరుకున్న సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది.
త్వరలో సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా ను స్వయంగా సూర్య తన సొంత నిర్మాణ సంస్థ లోనే నిర్మించబోతున్నాడు. సినిమా ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఉంటుంది అనే విషయాలపై క్లారిటీ లేదు.. కాని తన తండ్రి మరియు బాలా తో కలిసి సూర్య దిగిన ఫొటోను షేర్ చేసి సినిమా పై జనాల్లో ఆసక్తి పెంచాడు. ఇన్నాళ్ల తర్వాత బాలా దర్శకత్వం లో సినిమా ను చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. నాన్న గారి ఆశీస్సులతో ఈ సినిమా ను పట్టాలెక్కించబోతున్నాం అంటూ సూర్య ట్వీట్ చేశాడు. అతి త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడిస్తానంటూ సూర్య ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.. ఇప్పటికి అయినా ఇస్తున్నందుక కృతజ్ఞతలు అంటూ బాలా మరియు సూర్యలకు అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు.