ప్ర‌ముఖ న‌టుడి భార్య మృతి.. హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా??

Update: 2021-05-15 15:30 GMT
ప్ర‌ముఖ‌ మోలీవుడ్ న‌టుడు ఉన్నిరాజ‌న్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమ‌నాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. అదికూడా.. భ‌ర్త‌పై వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు పెట్టిన మ‌ర్నాడే చ‌నిపోవ‌డంతో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మృతురాలి కుటుంబ స‌భ్యులు మాత్రం ఇది ఖ‌చ్చితంగా హ‌త్యేన‌ని అంటున్నారు. దీంతో.. ప్రియాంక మృతి సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

దివంగ‌త‌ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు రాజ‌న్ పీ దేవ్ కుమారుడే ఉన్ని రాజ‌న్‌. 2019లో ఉన్ని రాజ‌న్‌-ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్ల‌యిన కొన్నేళ్ల‌కే వీరి దాంప‌త్యంలో క‌ల‌త‌లు మొద‌లైన‌ట్టు స‌మాచారం. ఉన్ని రాజ‌న్ డ‌బ్బుల కోసం ప్రియాంక‌ను వేధించేవాడ‌ని.. ఆమె త‌ర‌పు కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్న‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. ప్రియాంక ఈ విష‌యం త‌మ‌కు చెప్ప‌లేద‌ని, త‌న‌కు అవ‌స‌రాలు ఉన్నాయ‌ని డ‌బ్బులు అడిగి తీసుకునేద‌ని వారు పోలీసుల‌కు చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

కొద్దిరోజులుగా అత‌ని వేధింపులు మ‌రింత‌గా ఎక్కువ‌య్యాయ‌ని, వాటిని త‌ట్టుకోలేక అస‌లు విష‌యం త‌మ‌కు చెప్పింద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్రియాంక‌ను హింసించిన వీడియోలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు.. అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మ‌ర్నాడే మ‌ర‌ణించింద‌ని, ఇది ఖ‌చ్చితంగా హ‌త్యేన‌ని కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ప్రియాంక‌ బుధ‌వారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు వేళాడుతూ చ‌నిపోయి క‌నిపించింద‌ట‌. ఉన్నిరాజ‌న్ హ‌త్య‌చేసి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నాడ‌ని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నార‌ట‌. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News