ప్రముఖ మోలీవుడ్ నటుడు ఉన్నిరాజన్ భార్య ప్రియాంక రెండు వారాల క్రితం అనుమనాస్పద స్థితిలో మృతిచెందారు. అదికూడా.. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టిన మర్నాడే చనిపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనని అన్నారు. దీంతో.. ప్రియాంక మృతి సంచలనం రేకెత్తించింది.
దివంగత క్యారెక్టర్ ఆర్టిస్టు రాజన్ పీ దేవ్ కుమారుడే ఉన్ని రాజన్. 2019లో ఉన్ని రాజన్-ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన కొన్నేళ్లకే వీరి దాంపత్యంలో కలతలు మొదలైనట్టు సమాచారం. ఉన్ని రాజన్ డబ్బుల కోసం ప్రియాంకను వేధించేవాడని.. ఆమె తరపు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయినప్పటికీ.. ప్రియాంక ఈ విషయం తమకు చెప్పలేదని, తనకు అవసరాలు ఉన్నాయని డబ్బులు అడిగి తీసుకునేదని వారు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
కొద్దిరోజులుగా అతని వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయని, వాటిని తట్టుకోలేక అసలు విషయం తమకు చెప్పిందని వారు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రియాంకను హింసించిన వీడియోలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మర్నాడే మరణించిందని, ఇది ఖచ్చితంగా హత్యేనని కుటుంబ సభ్యులు కేసు పెట్టినట్టు సమాచారం.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా.. ప్రియాంక భర్త ఉన్ని రాజన్ ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఘటన జరిగిన వెంటనే అరెస్టు చేయాలని అనుకున్నప్పట్టికీ.. అతను కరోనా బారిన పడ్డట్టు సమాచారం. ఇప్పుడు నెగెటివ్ రావడంతో.. అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.