రంగుల ప్రపంచంలో గ్లామ్ అండ్ గ్లిజ్ ని తప్ప కామన్ జనం ఇంకేవీ పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలను నిరంతరం వేధించే అంతు లేని అనారోగ్య సమస్యల గురించి.. వ్యక్తిగత కుటుంబ జీవనంలో ఎత్తు పల్లాలు.. వృత్తిగత సమస్యల గురించి వారికి తెలిసేది చాలా తక్కువ. సల్మాన్ ఖాన్ .. దీపిక పదుకొనే మొదలు సమంత .. వరుణ్ ధావన్ వరకూ ఏ ఒక్కరూ ఆరోగ్యంగా లేరు అన్నది తెలిస్తే అభిమానులు షాక్ తినక తప్పదు. మానసికంగాను వారు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని కొన్ని సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు.
బాలీవుడ్ ట్యాలెంటెడ్ యువహీరో వరుణ్ ధావన్ గురించిన ఒక షాకింగ్ నిజం అభిమానులను ఇప్పుడు కలవరపెడుతోంది. వరుణ్ ధావన్ చివరిగా జగ్ జగ్ జీయోలో కనిపించాడు. ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కానీ మహమ్మారి సమయంలో ధావన్ నటించిన `కూలీ నంబర్ 1` OTTలో విడుదలైంది. కానీ ఆశించిన మార్క్ ని అందుకోవడంలో జనాదరణ పొందడంలో విఫలమైంది. ప్రస్తుతం భేడియా విడుదల ప్రచారంలో బిజీగా ఉన్నాడు.
మహమ్మారి ప్రజలను ఎలా ప్రభావితం చేసిందో.. ప్రతిదీ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తాము కష్టపడి పని చేయడానికి ఎలాంటి ప్రణాళికతో సిద్ధమయ్యామో కూడా ధావన్ తెలిపారు. ఇండియన్ టుడే ముంబై కాన్ క్లేవ్ 2022లో వరుణ్ ధావన్ చాలా విషయాలు మాట్లాడారు. అంతేకాదు ఇదే వేదికపై అతడు అభిమానులకు షాకిచ్చే వ్యక్తిగత విషయం ఒకటి చెప్పాడు. అతను చాలా కాలంగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఇది కనిపించకుండా కాల్చేసే డిసీజ్. మేము ఈ రేసులో ముందుకు నడుస్తున్నాము.. ఎందుకు? అని ఎవరూ అడగడం లేదని కూడా అతడు వ్యాఖ్యానించాడు.
మీడియా ఇంటరాక్షన్ సమయంలో వరుణ్ ధావన్ పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న తీవ్రమైన పోటీ గురించి మాట్లాడుతూ... ప్రతి ప్రాజెక్ట్ కోసం కష్టపడి పనిచేయడానికి తనను తాను ఎలా పురికొల్పుతున్నాడో కూడా వెల్లడించాడు. ధావన్ బోయ్ మాట్లాడుతూ- ``మేము తలుపులు తెరిచిన నిమిషం.. క్యాట్ అండ్ ర్యాట్ రేసులోకి వెళ్లామని మీరు అనుకోవాలి. ఇక్కడ ఎందరో పోటీలో ఉన్నారు. మరింత కష్టపడి పనిచేస్తున్నారు. ఇవన్నీ నేను చూస్తున్నాను! నిజానికి నేను నా చిత్రం జగ్‌జగ్ జీయోతో చాలా కష్టపడటం ప్రారంభించాను. నేను ఎన్నికలకు పోటీ చేస్తున్నట్లు అనిపించింది. ఎందుకో నాకు తెలియదు కానీ నాకు నేనుగా నాపై చాలా ఒత్తిడి పెంచాను`` అని కూడా అన్నారు.
ఉన్నట్టుండి నాకు ఏం జరిగిందో తెలీదు. నేను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అని రుగ్మతతో బాధపడుతున్నానని వైద్యుల ద్వారా తెలిసింది. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే.. ప్రాథమికంగా మన ``బ్యాలెన్స్ ఆఫ్ అవుతుంది``. కానీ వృత్తిపరంగా నేను చాలా కష్టపడ్డాను! మనం ఈ రేసులో నడుస్తున్నాం.. ఎందుకు? అని ఎవరూ అడగడం లేదు. మనమంతా ఇక్కడ ఎందుకు ఉన్నాం? అనే దానికంటే గొప్ప ప్రయోజనం కోసం ప్రయత్నంలో ఉన్నామని భావిస్తున్నాను. నేను నాలో నన్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరికి వారు ఇలానే తమ గురించి కనుగొంటారని ఆశిస్తున్నాను`` అని అన్నాడు.
వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటీ? అంటే.. లోపలి చెవి బ్యాలెన్స్ భాగం సరిగ్గా పనిచేయదు. ఇది తలకు ఒక వైపు లేదా రెండు వైపులా సంభవించవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. ఇది పైకి కనిపించకుండా సమస్యలు క్రియేట్ చేస్తుంటుంది. వరుణ్ ఇప్పుడు దీనిని ఎదుర్కొంటున్నాడు.
వరుణ్ ధావన్ నటించిన భేడియా విషయానికి వస్తే... ఈ చిత్రం హర్రర్ క్రీచర్ కామెడీ.. అతడు తోడేలు పాత్రలో కనిపిస్తాడు. ఇందులో కృతి సనన్- అభిషేక్ బెనర్జీ- దీపక్ డోబ్రియాల్ తదితరులు నటించారు. నవంబర్ 25న విడుదల కానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. దీనిని దినేష్ విజన్ మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.